తెలుగు తమిళ మలయాళ సినిమాలో యాక్షన్ హీరోగా సినీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు అర్జున్. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల  సినిమాల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎన్నో సినిమాల్లో నటించి తన నటనతో ఆకట్టుకున్నారు. కేవలం నటనతోనే కాకుండా ఆయన ఆటిట్యూడ్ తో  కూడా ఎంతో మంది ప్రేక్షకులను ఆకర్షించారు నటుడు అర్జున్. తెలుగు తమిళ మలయాళ కన్నడ... భాషలో ఇండస్ట్రీ తో పనిలేకుండా మన హీరో అనే పేరు తెచ్చుకున్నాడు యాక్షన్ హీరో అర్జున్. యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులందరికీ యాక్షన్ హీరోగా మారిపోయాడు. ఒకప్పుడు హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అర్జున్  ఇప్పుడు ముఖ్యపాత్రల్లో కనిపిస్తూ విలన్గా కూడా మెప్పిస్తున్నాడు. 

 

 

 అర్జున్ నటించిన అన్ని భాషల్లో తన నటనకి గాను మంచి మార్కులు కొట్టేసి యాక్షన్ హీరోగా మారిపోయాడు. నాలుగు భాషల్లో అర్జున్ ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. తన సినిమాలతో ఎన్నో రికార్డులు సైతం సృష్టించారు. అంతే కాకుండా ప్రేక్షకులను ఎంతో ప్రభావితం చేసేవారు అర్జున్ . అయితే తాజాగా అర్జున్ ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు. నటన వైపు కి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాను  అని యాక్షన్ హీరో అర్జున్ చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో తనకు అవకాశాలు రాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చారు. 

 

 

 

 తనకు ఎదురైన ప్రతి ఒక్క సంఘటనను ఒక పాఠంగా మలచుకొని ధైర్యంగా ముందుకు అడుగులు వేశాను అంటూ ఆయన చెప్పారు. తన నటన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో ఇబ్బందులు ఎదురైనట్లు గానే  ఎంతో మంది మంచి స్నేహితులు పరిచయం అయ్యారని యాక్షన్ హీరో అర్జున్ చెప్పుకొచ్చారు. తనకున్న మంచి స్నేహితుల్లో  జగపతి బాబు ఒకరు సౌందర్య ఒకరు అని తెలిపారు అర్జున్. తనకు మిస్ యూ అనే పదానికి అర్థం ఏమిటి అనేది సౌందర్య చనిపోయిన తర్వాత తెలిసింది అంటూ అర్జున్ చెప్పుకొచ్చారు. సౌందర్య ఎంత అందమైనదో అంతకుమించిన అభినయం ఆమె సొంతం అని... అందం అభినయం పద్ధతి ఇలా అన్ని రకాల మంచి లక్షణాలు అన్నీ కలిపితే సౌందర్య అవుతుంది అంటూ అర్జున్ గుర్తు చేసుకున్నారు. అన్ని మంచి లక్షణాలు కలిగి ఉండడం నిజంగా చాలా అరుదైన విషయమని అర్జున్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: