మన ఇండియన్ సినిమాలు హాలీవుడ్ స్థాయిలో ఆడిన సందర్బాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగులో బాహుబలి ఫ్రాంచైజీ హాలీవుడ్ సినిమాలకి ధీటుగా నిలబడింది. ఇక బాలీవుడ్ లో దంగల్ లాంటి సినిమాలు మన ఇండియన్ సినిమా స్థాయి ఏంటో నిరూపించాయి. అంతేకాదు వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు అంటూ ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లను కూడా రాబట్టాయి. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి బాహుబలి, బాలీవుడ్ నుంచి దంగల్ సినిమాలు హాలీవుడ్ సినిమాల కలెక్షన్స్ తో పోటీ పడ్డాయి. అలాంటిది గత ఏడాది (2019) లో వచ్చిన ఏ ఇండియన్ సినిమా కూడా 350 కోట్ల వసూళ్లను రీచ్ కాలేకపోవడం దురదృష్ఠకరం అని చెప్పాలి. కాని ఇండియాలో విడుదలైన హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ మాత్రం ఏకంగా 375 కోట్ల వసూళ్లను సాధించి మన వాళ్ళకు షాకిచ్చింది. 

 

ఇక ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇండియాలో హాలీవుడ్ సినిమా ఇండియన్ సినిమా కలెక్షన్స్ ను బీట్ చేయలేదు. కాని ఈసారి ఇండియన్ సినిమాలలో టాప్ గా నిలిచింది బాలీవుడ్ సినిమా వార్ టాలీవుడ్ సాహో సినిమాలు మాత్రమే. ఈ రెండు సినిమాల్లో వార్ సినిమా 320 కోట్లు వసూళ్లు చేయగా ప్రభాస్ సాహో 300 కోట్లను వసూళ్లు చేసింది. ఇండియన్ సినిమా వసూళ్లను ఒక హాలీవుడ్ మూవీ ఇండియాలో బీట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇండియన్ సినిమాకు ఇది దారుణమైన సంవత్సరంగా (2019) చెప్పక తప్పదు.

 

2019 సంవత్సరంలో బాలీవుడ్ లో ఎన్నో భారీ సినిమాలు విడుదల అయినప్పటికి కూడా కొన్ని దారుణమైన డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. కొన్ని మాత్రం పర్వాలేదు అన్న మాట దగ్గర ఆగిపోయాయి. ఇక కొన్ని సినిమాలు మాత్రమే ఇలా రెండు వందల కోట్లను దాటి మూడు వందల కోట్లల్లో పడ్డాయి. మరి 2020 సంవత్సరంలో అయినా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఇండియన్ సినిమా నెం.1 గా నిలుస్తుందా అన్నది చూడాలి. అవెంజర్స్ స్థాయి హాలీవుడ్ మూవీ వస్తే ఈసారి కూడా ఇండియాలో అదే టాప్ లో నిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ ఏడాది (2020) లో దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సిన్మా రాబోతుంది. కాబట్టి ఇండియన్ సినిమా టాప్ లో నిలిచే అవకాశం ఖచ్చితంగా ఉందని కొందరు సౌత్ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా జూన్ లేదా జూలై లో గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ చరణ్ సరసన నటిస్తోంది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: