టాలీవుడ్ లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నితిన్ కాంబినేషన్ లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్ ’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ అదా శర్మ.  2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేసింది.  అప్పట్లో ఈ మూవీ మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతే కాదు ఈ సినిమాకు గాను ఫిలింఫేర్ ఉత్తమ ఫీమేల్ డెబ్యూ పురస్కారం కూడా వచ్చంది.  హార్ట్ ఎటాక్ మూవీ తర్వాత  సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గరం, క్షణం సినిమాలు విజయం  సాధించాయి.   2015లో రాణా విక్రమ అనే కన్నడ సినిమాలో కూడా నటించింది.

 

ఈ సినిమాలన్నీ కమర్షియల్ గా మంచి హిట్ అవడమే కాక, ఆమె నటనకు ప్రశంసలు కూడా లభించడం విశేషం.  ఇక సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బ్యూటీ జిమ్నాస్టిక్ లో అందవేసిన చెయ్యి.  అప్పుడప్పుడు తన చిత్ర విచిత్ర విన్యాసాలతో ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.  మార్షల్ ఆర్ట్స్ లో ఇప్పటికే పట్టభద్రురాలైన ఆదా శర్మ తాజాగా నాన్ చాక్, కర్రసాము వంటివి కూడా నేర్చుకుంటోంది.  అదే విధంగా డ్యాన్స్ లోను మంచి ప్రవేశం ఉన్నది.  కథక్ లో ఇప్పటీకే డిగ్రీ చేసింది. దీంతో పాటుగా ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆదా శర్మ గత కొంతకాలంగా ఓ వ్యాపార వేత్తతో డేటింగ్ లో ఉందని వార్తలు వస్తున్నాయి.

 

అయితే ఇందులో ఎంత నిజం ఉందన్న విషయం మాత్రం ఇంకా  సస్పెన్స్.  అయితే ఇదే విషయాన్ని ఆదా శర్మ ముందు ప్రస్తావిస్తే.. తనకు సమయం లేదని, అసలు ఆ వ్యాపారవేత్త ఎవరో తెలియదని అంటోంది.  గత కొంత కాలంగా తన హాట్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. తాజాగా అందాలను చూపిస్తేనే అవకాశాలు వస్తాయి అనే లైన్ ఫాలో అవుతుంది ఈ అమ్మడు.   సోషల్ మీడియాలో కూడా అందాలను ఆరబోయటంలో వెనక్కి తగ్గటం లేదు ఆదా. మరి ఈ అమ్మడి అందాల ఆరబోతకు దర్శక, నిర్మాతలు ఫిదా అవుతారా? ఛాన్సులు ఇస్తారా లేదా అన్నది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: