డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ బద్రి నుండి నిన్న వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాల వరకు తీసిన సినిమాలలో బ్లాక్ బస్టర్స్ ఎన్ని ఉన్నాయో యావరేజ్, ఫ్లాప్స్ కూడా అన్ని ఉన్నాయి. కుర్ర హీరోల నుండి అమితాబ్ బచ్చన్, పవన్ కళ్యాణ్, బాలయ్య, నాగార్జున వంటి స్టార్స్ తో సినిమాలు తీసి ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ గా ఎవరూ సంపాదించనంత సంపాదించారు. అలానే ఎవరూ పోగొట్టుకోలేనంత పోగొట్టుకున్నారు. ఒక మనిషిని ఇండస్ట్రీలో నమ్మడం అంటే మనల్ని మనం మోసం చేసుకోవడమే అన్న అనుభవాన్ని పూరి పొందారు. 

 

ఇక హీరోని ఒక మాస్ ఇమేజ్ వచ్చేలా చూపించడం అంటే అది పూరి తర్వాతే ఎవరైనా. హీరో ఎవరైనా వాళ్ళలో పూరి మేనరిజమే కనపడుతుందంటే అది ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. సినిమాకోసం ప్రాణం పెట్టేస్తాము అంటుంటారు చాలామంది. కాని పూరి సినిమాని ప్రేమిస్తాడు ..ప్రాణంగా చూసుకుంటాడు. ఇక ఇమ కథ అనుకున్నాడంటే పూరి 100 రోజుల్లో థియోటర్స్ లోకి వచ్చి 100 రోజులు ఆడాల్సిందే. అలా సినిమాని పిచ్చ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాడు. ఇప్పుడున్న దర్శకులలో హీరో ఎంత పెద్ద స్టార్ అయినా సినిమాని 70-80 రోజుల్లో కంప్లీట్ చేయడం పూరి స్టైల్ అండ్ స్టామినా. 

 

ఇక గత కొంతకాలంగా పూరి సరైన హిట్స్ లేక చాలా ఇబ్బందులు పడ్డాడు. బయట హీరోలు డేట్స్ ఇవ్వక, నిర్మాతలు మొహం చాటేస్తే తనే నిర్మాతగా కొడుకుని హీరోగా పెట్టి మెహబూబా అన్న సినిమాఇ తెరకెక్కించాడు. ఎన్నో ఆశలు పెట్టుకుంటే తన కొడుకుకే హిట్ ఇవ్వలేకపోయాడు పూరి. అది ఆయన్ని బాగా డిస్ట్రబ్ చేసింది. అందుకే ఎప్పటిలానే మళ్ళీ కసిగా ఒక మాస్ కథ ను రాసుకున్నాడు. కానీ అనుకున్న హీరోలెవరు దొరకలేదు. దాంతో అప్పటికే ఫ్లాప్స్ తో సతమతమవుతున్న రాం ని సెలెక్ట్ చేసుకొని ఇస్మార్ట్ శంకర్ ని తెరకెక్కించాడు. ఈ సినిమా తీసినన్ని రోజులు అందరు పూరి ని గాబా ఎత్తిపొడిచారు. మళ్ళి ఫ్లాప్ సినిమా తీస్తున్నాడని కామెంట్ చేశారు. అన్ని సైలెంట్ గా వింటు వచ్చిన పూరి ఇస్మార్ట్ శంకే ని రిలీజ్ చేశాడు.

 

బొమ్మ బ్లాక్ బస్టర్ అని ఒక్క షోతోనే అర్థమైపోయింది. అంతేకాదు పూరి టీం లో చేసిన రాం, హీరోయిన్స్ నిధి అగర్వాల్, నభా నటేష్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ..ఇలా అందరికి బౌన్స్ బ్యాక్ అయింది. మొత్తానికి పూరి సక్సస్ ఇచ్చి ఇండస్ట్రీకి షాకిచ్చాడు. అదే ఊపుతో ఇప్పుడు కొడుకుతో రొమాంటిక్ అనే సినిమా ని సొంత బ్యానార్ మీద నిర్మిస్తున్నాడు. ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆకాష్ రొమాంటిక్ సీన్స్ లో బాగా ఇన్వాల్వ్ అయి నటీంచాడట. కొన్ని సిన్న్స్ ని తండ్రి పూరి దగ్గరుండి చూడలేక పక్కకు వెళ్ళిపోయాడట. అంత బాగా ఆకాష్ నటించడట. ఇక ఇప్పటికే పోస్టర్స్ తో సినిమాపై విపరీతమైన క్రేజ్ తీసుకువచ్చారు పూరి అండ్ ఛార్మీ టీం. అంతేకాదు మరోసారి బ్లాక్ బస్టర్ కొట్టడానికి పూరి రెడీగా ఉన్నారంటూ చెప్పుకుంటున్నారు.     

మరింత సమాచారం తెలుసుకోండి: