అర్జున్ కపూర్, మలైకా అరోరా డేటింగ్ సీక్రెట్ బీటౌన్ సర్కిల్స్ లో ఎప్పటికప్పుడు హాట్ టాపికే. ఇన్నాళ్లు గుట్టుచప్పుడుగా రిలేషన్ మెయిన్ టేన్ చేస్తున్న ఈ బాలీవుడ్ హాట్ జోడీ న్యూ ఇయర్ వేళ ఓపెన్ అయిపోయారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఈ జోడీ తమ మధ్య ఎలాంటి రిలేషన్ ఉందనేది చెప్పకనే చెప్పేశారు. 

 

ఏజ్ తో సంబంధం లేకుండా బాలీవుడ్ సెలబ్రెటీస్ రిలేషన్స్ మెయిటేన్ చేస్తున్నారు. అలా 33ఏళ్ల అర్జున్ కపూర్స 45ఏళ్ల మలైకా అరోరాతో నడుపుతున్న సీక్రెట్ లవ్ ఎఫైర్ బీటౌన్ లో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్. బీటౌన్ లో ఎన్ని జంటలు ఉన్నా ఈ జంట తీరే వేరు. అందుకే వీళ్లు ఏది చేసినా వైరల్ అయిపోతోంది. ఇన్నాళ్లు జస్ట్ ఫ్రెండ్ షిప్ మాత్రమే అని చెప్పిన ఈ జోడీ న్యూ ఇయర్ సందర్భంగా తమ రిలేషన్ లోని హాట్ యాంగిల్ ని చెప్పకనే చెప్పేశారు. 

 

అర్జున్ కపూర్, మలైకా అరోరాకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా వైరల్ అవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా అర్జున్ కపూర్ కు ముద్దిచ్చిన ఫటోటోను మలైకా పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ తమ రిలేషన్ విషయంలో క్లారిటీ ఇవ్వని ఈ జంట తాజాగా ముద్దుతో ఎలాంటి రిలేషన్ లో ఉన్నారనే విషయాన్ని రివీల్ చేశారు. 

 

1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ పెళ్లాడిన మలైకా అరోరా 2017లో డైవర్స్ తీసుకుంది. విడాకుల కంటే ముందు నుండే ఈ హాట్ బ్యూటీ గత నాలుగేళ్లుగా అర్జున్ కపూర్ తో సీక్రెట్ గా డేటింగ్ చేస్తుందని బాలీవుడ్ కోడైకూస్తోంది. అయితే తమ రిలేషన్ ని కన్ఫార్మ్ చేసింది. మరి ఈ కొత్త ఏడాదిలోనైనా అర్జున్, మలైకా అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: