నిన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ వారి డైరీ ఆవిష్కరణ సభలో భాగంగా, అసోసియేషన్ వారు చేసిన కార్యక్రమాలపై మెగాస్టార్ చిరంజీవి పాజిటివ్ గా మాట్లాడుతున్న సమయంలో మధ్యలో అక్కడక్కడా అడ్డుపడిన హీరో రాజశేఖర్, ఆ తరువాత కాసేపటికి స్టేజిపైకి వచ్చి రచయిత పరుచూరి గోపాల కృష్ణ నుండి మైక్ లాక్కుని మరీ మాట్లాడడం జరిగింది. ముందుగా స్టేజ్ పైన ఉన్న వారి నుండి ఆశీర్వాదాలు తీసుకున్న రాజశేఖర్, మెగాస్టార్ చిరంజీవి గారు అసోసియేషన్ గురించి ఎంతో చక్కగా మాట్లాడారని, అయితే ఆయన చెప్పిన విధంగా కాకుండా ఇక్కడ మాలో విబేధాలు ఉన్నాయి, కానీ అవి మాత్రం బయటపెట్టడం లేదంటూ మాట్లాడడం జరిగింది. 

 

ఆ తరువాత చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్ తదితరులు రాజశేఖర్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసారు. కాగా కాసేపటి తరువాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారి దగ్గరి నుండి ఎందరో నటులు అసోసియేషన్ అభివృద్ధికి తమవంతుగా పాటుపడుతూ వచ్చారని, ఇక ఇటీవల నేను, చిరంజీవి సహా చాలా మంది తమ వంతుగా సాయం అందిస్తున్నారని అన్నారు. అయితే ఎక్కడో ఒక చోట కొద్దిపాటి లోపాలున్నాయని, వాటిని ఈ విధంగా బహిర్గతం చేయడం, మన మధ్యన మనమే విబేధాలు సృష్టించుకోవడమేనని అన్నారు. 

 

ఎవరు సినిమా నటులను గురించి తప్పుగా మాట్లాడినా తాను మొదటి నుండి సహించేవాడిని కానని, అలా మాట్లాడితే తాను ఎంతటి గొడవకైనా సిద్ధం అని, కొట్టుకుందాం అంటే ఎక్కడికి అయినా, ఎందాకైనా రావడానికి నేను రెడీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. నిజానికి రాజశేఖర్ తో తనకు మంచి అనుబంధం ఉందని, అయితే ఈ విధంగా అందరి ముందు మాట్లాడడం మాత్రం సరైనది కాదని అన్నారు. కాగా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: