సిని పరిశ్రమలో ఆఫర్లు రావాలంటే హీరోయిన్స్ ఫాలో అయ్యే ఫార్ములా.. అభినయంతో ఎలా చేసినా సరే అందంతో మాయ చేసేందుకు రెడీ అంటారు. అందుకే సినిమాలు చేసిన చేయకపోయినా ఎప్పుడూ ఫోటో షూట్స్ తో తమ అందాలతో ఆడియెన్స్ కు కిక్ ఎక్కిస్తుంటారు ముద్దుగుమ్మలు. అయితే కమర్షియల్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకునేందుకు ఒక హీరోయిన్ లిప్ లాకులు, బోల్డ్ సీన్స్ కు సై అనేసిందట. ఒక చిన్న సినిమాతో తెలుగు పరిశ్రమకు అడుగు పెట్టిన ఈ అమ్మడు తన టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చింది.   

 

2019 ఇయర్ ఎండింగ్ లో ఏకంగా రెండు సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్న ఆ హీరోయిన్ లేటెస్ట్ గా ఈ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజయ్యే సినిమాలో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా హాట్ షో చేసింది. మడి కట్టుకు కూర్చుంటే ఇక్కడ అవకాశాలు రావని లేటుగా గుర్తించిన ఈ భామ ఆ సినిమాలో లిప్ లాక్ సీన్స్ మాత్రమే కాదు బెడ్ రూం సీన్స్ లో కూడా నటించిందని తెలుస్తుంది. టీజర్ తో సినిమాపై క్రేజ్ రాగా ఆ హీరోయిన్ ఇలా చేయడంపై అందరు ముక్కున వేలేసుకున్నారు.

 

ఇన్నాళ్లు తన మీద ఉన్న క్లీన్ ఇమేజ్ కాస్త చెరిపేసేలా అమ్మడి కొత్త సినిమా టీజర్ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం అమ్మడి కెరియర్ కు ఈ సినిమా ప్లస్ అనే చెప్పొచ్చు. ప్రస్తుతం యువ హీరోలతోనే కాదు స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు టీజర్ లోనే ఇలా రెచ్చిపోయింది అంటే కచ్చితంగా సినిమాలో ఆమె ఫ్యాన్స్ కు షాక్ ఇవ్వడం ఖాయమని తెలుస్తుంది. ఇన్నాళ్లు ఆమె అభినయానికి మాత్రం వాడుకోవచ్చని అనుకున్న దర్శక నిర్మాతలకు కొత్త సినిమాతో పెద్ద షాక్ ఇవ్వబోతుంది అమ్మడు. 

 

మరి ఆ హీరోయిన్ తీసుకున్న ఈ క్రేజీ స్టెప్ ఆమె కెరియర్ కు ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం కెరియర్లో మంచి ఫాం కొనసాగిస్తున్న ఈ అమ్మడు స్టార్ అయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుందని తెలుస్తుంది. రీసెంట్ గా రిలీజైన రెండు సినిమాల్లో అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: