టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి 2 తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఏడాది గ్యాప్ తీసుకొని స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ‘ఆర్ఆర్ఆర్’ మల్టీస్టారర్ మూవీ రూపొందిస్తున్నారు.  ఈ మూవీ గురించి ఆ మద్య ఓ ప్రెస్ మీట్ పెట్టి చరణ్, ఎన్టీఆర్ పాత్రల గురించి వివరించారు.  ఈ మూవీ 1920 కాలం నాటి స్వాతంత్ర పోరాటం సమయంలో జరిగిన ఇద్దరు మన్యం వీరులకు సంబంధించిన మూవీ అన్నారు.  ఆంధ్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపించబోతున్నారట. ఇక తెలంగాణ ముద్దుబిడ్డ.. మన్యం వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపాడు. ఇప్పటికే ఈ మూవీ షెడ్యూల్స్ పూర్తి అవుతున్నాయి.

 

ఇటీవల రామోజీ ఫిలిమ్ సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు జరుపుకున్నారు.  తాజాగా ఈ మూవీ గురించి రక రకాల కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు ఈ మూవీకి సంబంధించిన కొన్ని లీకేజీలు కూడా అవుతున్నాయి. తాజాగా ఈ మూవీ గురించి మరో రూమర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే.  పాత్ర పరంగా ఆయన ఈ సినిమాలో తలపాగాతో కనిపిస్తాడు. అయితే ఒకానొక సందర్భంలో .. కొన్ని నిమిషాల పాటు ఆయన గుండుతోనూ కనిపిస్తాడనే ప్రచారం ఫిల్మ్ నగర్లో జోరుగా జరుగుతోంది. అయితే ఈ వార్తను కొంతమంది కొట్టిపారేస్తుండగా, ఈ కథలో కల్పితం కూడా ఉందని రాజమౌళి చెప్పడం వలన ఎన్టీఆర్ గుండుతో కనిపించే అవకాశం లేకపోలేదని మరికొందరు అంటున్నారు.

 

ఇది ఒక ప్రయోగాత్మక మూవీ కావడం వలన, ఎన్టీఆర్ అందుకు అంగీకరించి ఉంటాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  కాకపోతే ఇప్పటికే ఎన్టీఆర్ ఎలా ఉంటుందో ఆ మద్య ఫోటో, వీడియో లీక్ అయ్యాయి..అయితే ఇప్పటి వరకు రామ్ చరణ్ పాత్ర ఎలా.. ఆయన లుకింగ్ ఎలా ఉండబోతుందో చాలా గోప్యంగా ఉంచారు. అయితే ఎలాంటి ప్రయోగాలకైనా సిద్దంగా ఉండే  ఎన్టీఆర్ అందుకు అంగీకరించి ఉంటాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయవలసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: