ఈ మధ్యకాలంలో తెలుగు సినీ పరిశ్రమ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఒకప్పుడు సినిమా ప్రపంచంలో ఏదైన సమస్య వస్తే సినీ రంగంలోని పెద్దలు కూర్చుని ఆ సమస్యకు పరిష్కారం చూపించేవారు. కానీ నేడు ప్రతిచిన్న విషయానికి కూడా రచ్చ రచ్చ చేయడం మీడియా కంటబడటం అదికాస్త అందరికి తెలియడం జరుగుతుంది. మొన్నటికి మొన్న మా అసోసియేషన్‌లో జరిగిన గొడవ గురించి అందరికి తెలిసిందే.

 

 

ఇకపోతే వ్యభిచారం అని నాటుగా పలికే పదాన్ని సినీ బాషలో క్యాస్టింగ్ కౌచ్ అని పిలుస్తారు. ఇది ప్రతి హీరోయిన్లను బయటకు లాగింది. ఎందరో హీరోయిన్స్ ఈ విషయంలో స్పందించి పలు వివాదస్పదమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఆ మద్యకాలంలో ఓ సీనియర్ నటి అందమైన అమ్మాయిలకు వలవేసి అవకాశాలు ఇప్పిస్తానని వారికి ఆశ చూపించి వారితో వ్యభిచారం చేయించిన విషయాన్ని ఓ మీడియా సంస్ద బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విదేశాల్లో షోల పేరుతో పేరున్న హీరోయిన్లను పిలిపించుకుని అక్కడ కూడా ఈ దందాని యదేచ్చగా సాగించారు కొందరు.

 

 

ఆ విషయాన్ని కూడా కనిపెట్టి అందరి పై కేసు బుక్ చేసారు. ఇకపోతే ఇప్పుడున్న పరిస్దితుల్లో అవకాశాల కోసం కొందరు ఒళ్లమ్ముకుంటుండగా, మరికొంత మంది అమాయక ఆడపిల్లలకు ఆశ అనే వల వేసి అవకాశం కలిపిస్తామని నమ్మబలికి వారితో వ్యభిచారం చేయిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో సీనియర్  కథానాయకులు కొత్తగా అవకాశాల కోసం వస్తున్నటువంటి యువతులను వ్యభిచార కూపంలోకి  దింపుతున్నట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించే ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందమైన యువతులకు అవకాశాల ఎర  వేస్తూ వారిని  విటుల దగ్గరికి పంపిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

 

 

అయితే ఆమెకు సినీ పరిశ్రమలో మంచి పలుకుబడి ఉండడంతో తన పేరును మరియు వివరాలను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నట్లు సమాచారం. ఇకపోతే కొందరు అడ్దదారుల్లో ఆలోచించేవారు ఉండటం మూలాన సినీ పరిశ్రమలో ఉన్న వారికి చెడ్డపేరు వస్తుందని పలువురు వాపోతున్నారు. ఇక ఎవరైనా తమకు సినిమా అవకాశాల పేరుతో లైంగిక వాంఛలు తీర్చమని అడిగితే అలాంటి వాళ్ళ గురించి సినీ ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేయమని సినీ “మా” పెద్దలు కూడా చెప్పారు.

 

 

కానీ కొంతమంది అలా చేయకుండా అడ్డదారుల్లో అవకాశాలు సంపాదించడం కోసం గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్నారని తెలుస్తుంది.. ఇక ఇలాంటి సంఘటనలు తరుచుగా జరుగుతుండటంతో రాను రాను తెలుగు సినీ పరిశ్రమ వ్యభిచార కూపంగా మారుతుందా అనే అనుమానాలను కొందరు వెలిబుచ్చుతున్నారట... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: