కన్నడ సినిమా రంగంలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది 'కేజిఎఫ్'. సినిమాలో హీరోగా నటించిన యశ్ కి మంచి పేరు లభించింది. శాండిల్ వుడ్ లో కేజిఎఫ్ అనేక రికార్డులను పగలగొట్టింది. ఒక్క కన్నడ సినిమా రంగంలోనే కాక తెలుగులో మరియు ఇంకా అనేక భాషలలో విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో హీరో యశ్ కి మంచి మార్కెట్ దేశవ్యాప్తంగా క్రియేట్ అయింది. దీంతో సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో వెంటనే డైరెక్టర్ కే జి ఎఫ్ 2 స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో దేశ వ్యాప్తంగా కే జి ఎఫ్ 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.

 

కే జి ఎఫ్ మొదటి భాగంలో తల్లి కొడుకుల మధ్య బంధాన్ని చూపిస్తూ మాఫియా కథ నేపథ్యంలో బ్యాక్ డ్రాప్ లో మాస్ ఎలివేషన్లు రోమాలు నిక్కబొడుచుకునేలా యాక్షన్ సన్నివేశాలు ఉండటంతో రాబోతున్న కేజిఎఫ్ సీక్వెల్ పార్ట్ 2 పై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో సినిమా హీరో యశ్ ఇటీవల సౌత్ ఇండియా కి సంబంధించిన ఓ సినిమా ఈ వేడుకలో కేజిఎఫ్ 2 టీజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినట్లు వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే యశ్ పుట్టినరోజు నాడు సినిమాకి సంబంధించి టీజర్ విడుదల అవుతోందని సమాచారం.

 

యశ్ పుట్టినరోజు జనవరి 8వ తారీకు. దీంతో ఆ రోజు కేజిఎఫ్ 2 టీజర్ రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు బలంగా వినబడుతున్నాయి. అంతేకాకుండా సీక్వెల్ లో మొదటి భాగంలో కంటే యాక్షన్ సన్నివేశాలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుత రీతిలో ఉండబోతున్నట్లు ప్రేక్షకుల అంచనాలకు మించి సినిమా స్టోరీ డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించినట్లు సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. మొత్తంమీద చూసుకుంటే మొదటి భాగం కంటే కేజిఎఫ్ పార్ట్ 2 చాలా అద్భుతమైన రీతిలో తెరకెక్కించినట్లు సమాచారం.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: