టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఎన్నో  సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ వన్నె తగ్గని కమెడియన్ ఎవరైన  ఉన్నారు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అలీ. బాలనటుడిగా  తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినా అలీ  ఆ తర్వాత హీరోగా కూడా పలు సినిమాల్లో నటించారు. ఇక ఆ తర్వాత కమెడియన్ గా మారిపోయిన అలీ తనదైన స్టైల్ లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ముద్ర వేసుకున్నారు. కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయి ఎన్నో సినిమాల్లో  తన అద్భుతమైన కామెడీ తో తెలుగు ప్రేక్షకులను నవ్వించారు. ఓ వైపు  హీరోగా పలు సినిమాల్లో నటిస్తూనే కమెడియన్ గా తన సత్తా ఏంటో చూపించాడు. హీరో లతో సంబంధం లేకుండా ప్రతి హీరో పక్కన బెస్ట్ కమెడియన్ గా నిలిచి  తెలుగు ప్రేక్షకులు అందరినీ అలరించారు. 

 

 

 ఇప్పటికీ వన్నె తగ్గని కమెడియన్గా అలీ తన సత్తా చాటుతూనే ఉన్నాడు. వరుస అవకాశాలు దక్కించుకుంటూ తెలుగు ప్రేక్షకులు అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్నారు అలీ . ఇప్పటికీ టాలీవుడ్ లో వన్నె తగ్గని కమెడియన్ గా  ప్రస్థానం కొనసాగిస్తున్న కమెడియన్ అలీ. అయితే ఇప్పుడు వరకు హీరోగా కమెడియన్ గా  తెలుగు ప్రేక్షకులందరూ అలరించిన అలీ  నిర్మాణ రంగంలోకి ప్రవేశించేందుకు నిర్ణయించుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తన సొంత ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించారు కమెడియన్ అలీ. ఇతర బ్యానర్ల  కంటే భిన్నంగా తన నిర్మాణ సంస్థ పేరును అలీవుడ్ ఎంటర్టైన్మెంట్ గా ప్రకటించారు. 

 

 

 తన పేరును తన నిర్మాణ సంస్థలో కలిసి వచ్చేలా నామకరణం చేశారు కమెడియన్ అలీ. తాను ప్రారంభించిన నిర్మాణ సంస్థ ద్వారా వెబ్ సిరీస్ లు  వాణిజ్య ప్రకటనలు టీవీ సీరియల్ ఎంటర్టైన్మెంట్ షోలు  నిర్వహించాలి అన్నది అలీ ఆలోచనట. తెలుగులోనే కాకుండా హిందీ తమిళం కన్నడ భాషల్లో కార్యకలాపాలు ఉంటాయని అలీ తెలిపినట్లు సమాచారం. హైదరాబాద్ శివారులోని మణికొండ లో ఉన్న తన నివాసానికి దగ్గర్లోని అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ ఆఫీస్ ఏర్పాటు చేసినట్లు కమెడియన్ అలీ చెప్పుకొచ్చారు. ఇకపోతే బాల నటుడిగా హీరోగా కమెడియన్గా తెలుగు చిత్ర పరిశ్రమలో తన సత్తా చాటిన అలీ నిర్మాణ రంగంలో కూడా తన సత్తా చాటుతాడా  చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: