టాలీవుడ్ లో ఇప్పటివరకు గట్టిగా 50-60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోనే లేడు. ఈ మధ్యనే సినిమా గనక హిట్టయితే షే కింద బల్క్ అముంట్ తీసుకుంటున్నారు. అదే రెమ్యూనరేషన్. కానీ కోలీవుడ్‌లో అలా కాదు. రజినీకాంత్, కమల్ హాసన్‌ లొ వాళ్ళ రేంజ్ కి మించిన రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అంతేకాదు ఈ కోలీవుడ్ స్టార్ హీరోలిద్దరిని మించిన హీరో మరెవరైనా ఉన్నారంటే అది దళపతి విజయ్ మాత్రమే. ఈ హీరోకి కోలీవుడ్ లో ఉన్న క్రేజ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ‘విజిల్’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న విజయ్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ కి సంతకం చేయబోతున్నాడట. తమిళనాడుకు చెందిన అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ విజయ్‌తో మరో భారీ బడ్జెట్ తో సినిమాని నిర్మించబోతోంది. గతంలో సన్ పిక్చర్స్.. విజయ్‌తో కలిసి ‘సర్కార్’ సినిమా నిర్మించారు. ఈ సినిమా కోలీవుడ్ లో కలెక్షన్స్ పరంగా సునామీని సృష్ఠించింది. 

 

అందుకే మరోసారి విజయ్‌తో కలిసి సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు ప్రముఖ నిర్మాత కళానిధి మారన్. అయితే తన 65వ సినిమాకు విజయ్ తీసుకునే రెమ్యూనరేషన్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఈ సినిమాకు విజయ్ ఏకంగా 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోవాలని అనుకుంటున్నారట. అంటే రెమ్యూనరేషన్ విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ను విజయ్ బీట్ చేసినట్లేనని చెప్పుకుంటున్నారు. రజినీ నటించిన ‘దర్బార్’ సినిమాకు 90 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారని అంటున్నారు. కానీ విజయ్ ఆయన కంటే మరో పది కోట్లు ఎక్కువ తీసుకుంటున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అలా చూసుకుంటే తమిళ సినీ  పరిశ్రమలో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరో విజయ్ అని చెప్పొచ్చు.

 

ఇక ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహించబోతున్నాడని తాజా సమాచారం. ప్రస్తుతం విజయ్ ‘మాస్టర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి విలన్ పాత్రలో నటించనున్నారు. 2020 దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌కి సంబంధించిన షూటింగ్ కంప్లీటయిందట. ఇటీవల కర్ణాటకలోని శిమోగా ప్రాంతంలోని జైలులో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఇందులో మాళవిక మోహనన్ విజయ్ కి జంటగా నటిస్తున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: