ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సంపాదించాలని అంటారు పెద్దలు.. అయితే దాన్నే కొద్దిగా మార్చి చెబితే ఎక్కడ సంపాదించామో అక్కడే ఖర్చు పెడితే పెద్ద నష్టమేమి ఉండరు. ఇంకా సంపాదించిన దానికి ఎంతోకొంత కృతజ్ఞత చూపించినట్టు ఉంటుంది. ఇప్పుడు సేమ్ అలాంటి ఆలోచనతోనే కొత్త అడుగు వేస్తున్నారు కమెడియ ఆలి. సీతాకోక చిలుక సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన ఆలి ఇప్పటివరకు వల్దన కొద్ది సినిమాలు చేస్తూ అలరించాడు. కమెడియన్ గా అడపాదడపా సినిమాలు చేస్తున్న ఆలి కొత్తగా ఓ ప్రముఖ టివిలో ఆలితో సరదాగా షో చేస్తున్నాడు. అది కూడా సూపర్ సక్సెస్ అవడంతో అక్కడ ఫుల్ బిజీగా ఉన్నారు.

 

సినిమా ఆఫర్స్ వచ్చినా రాకున్నా ప్రస్తుతం ఆ చిట్ చాట్ షోతో తన ఫాం కొనసాగిస్తున్నారు ఆలి. ఇదిలాఉంటే ఈమధ్య వైసిపిలో జాయిన్ అయ్యి సీటు ఆశించిన ఆలికి నిరాశ మిగిలింది. అయితే జస్ట్ జాయిన్ అయ్యి మళ్లీ తన పని తాను చేసుకుంటున్న ఆలి కొత్తగా ప్రొడక్షన్ హౌజ్ ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. సినిమా పరిశ్రమ వల్లే తను ఈ స్థాయిలో ఉన్నాడని ఎప్పుడు గుర్తుచేసుకునే ఆలిసినిమా కోసమే తను డబ్బు ఖర్చు పెట్టనున్నాడు.

 

ఇక అలి బ్యానర్ పేరు కూడా ఆలివుడ్ అని పెట్టారట. టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్.. శాండల్ వుడ్.. హాలీవుడ్.. ఇలా అన్ని పేర్లు ఉన్నాయి కాని కొత్తగా ఈ ఆలివుడ్ ఏంటని ఆశ్చర్యపోవచ్చు. ఇది ఆలి బ్యానర్ పేరు.. ఏం చేసినా వెరైటీగా చేయాలనే ఆలోచనతో ఉండే ఆలి తన బ్యానర్ పేరుతో అందరిని సర్ ప్రైజ్ చేశాడు. ఈ బ్యానర్ లో సినిమాలు, వెబ్ సీరీస్ లు, సీరియల్స్ ఇలా అన్ని ప్లాన్ చేస్తున్నారట. ఆలివుడ్ ఇది క్రియేటివిటీకి సరికొత్త చిరునామా అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: