రవితేజ.. ప్రేక్షకుల నాడి పట్టుకున్న నటుడు. ఆడియన్స్‌ను కదలకుండా తన కామెడీ టైమింగ్‌తో నాన్ స్టాప్‌గా నవ్విపిస్తాడు, మంచి ఫైట్స్ చేస్తాడు అనే టాక్ ఒకప్పుడు ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో వరుస ఫ్లాపులు మూటగట్టుకున్న రవితేజ దాదాపుగా సంవత్సరకాలం పాటు ఖాళీగా ఉండి ఇప్పుడు చేస్తున్న చిత్రం డిస్కోరాజా.. కిక్ ఇచ్చిన కిక్కు మరే సినిమా ఇవ్వకపోవడంతో మనోడికి కిక్కు దొబ్బిందంటున్నాడు. మరి కిక్ లాంటి కిక్కు ఈ డిస్కోరాజ ఇస్తాడేమో అని అనుకుంటున్నారు సినిమానే లోకంగా బ్రతికే సినీపక్షులు.

 

 

ఇకపోతే మాస్ మ‌హారాజా ర‌వితేజ నటిస్తున్న డిస్కోరాజా చిత్రాన్ని.ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఫేమ్ వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా. ఎస్‌.ఆర్‌.టి. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక సైంటిఫిక్ ఫిక్ష‌న్‌ రెట్రో థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో. న‌భా న‌టేష్‌, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఇక ఇప్పటికే ట‌చ్ చేసి చూడు. నేల టిక్కెట్టు, అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని వంటి వ‌రుసగా హ్యాట్రిక్ ఫ్లాప్‌లు రావ‌డంతో డిస్కోరాజా విష‌యంలో మాస్ మహారాజా ర‌వితేజ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని సమాచారం..

 

 

ఇదిలా ఉండగా న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ర‌వితేజ్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. అంతే కాకుండా ఈ సినిమా రిలీజ్ కు టైం ద‌గ్గ‌ర‌పడుతుండ‌టంతో టీమ్ ఈ నెల 18న ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ని భారీ స్థాయిలో నిర్వహించ‌బోతున్నారని సమాచారం.. దీంతో డిస్కోరాజా ప్ర‌మోష‌న్ హంగామా త్వరలో మొద‌లుకాబోతోందన్నమాట.. ఇకపోతే ఈ చిత్రంలో రవితేజ టూ డైమెన్షన్స్ వున్న పాత్రలో క‌నిపించ‌బోతున్నారట.

 

 

గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగే స‌న్నివేశాలు ఈ చిత్రానికి ప్ర‌ధాన ఆకర్ణ‌ణ‌గా నిలుస్తాయ‌ని, ఇటీవ‌ల విడుద‌ల చేసిన ర‌వితేజ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌ల రెట్రో లుక్ ద్వారా తెలుస్తోంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు చివ‌రి ద‌శ‌కు చేరుకున్నఈ చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేయ‌డానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి: