సినిమా ఇండస్ట్రీ కోటి ఆశలతో 2020లోకి అడుగుపెట్టింది. ఓ సారి వెనక్కి తిరిగి చూస్తే.. చాలామంది హీరోలు ఫ్లాపుల్లో ఉన్నారు. హిట్ కావాల్సిన హీరోల లిస్ట్ చాలా పెద్దదే. ఎవరు ఏ సినిమాతో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారో  ఓ సారి పరిశీలిస్తే.. !

 

స్టార్ హీరోల్లో ఎన్టీఆర్.. మహేశ్ మాత్రమే సక్సెస్ లో ఉన్నాడు. దీంతో కంపల్సరీ హిట్ కావాల్సిన వారిలో మెగా హీరోలే ఎక్కువ. రామ్ చరణ్ లాస్ట్ ఇయర్ వినయ విధేయ రామ ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో కలిసి ట్రిపుల్ ఆర్ లో నటిస్తూ.. మగధీర తర్వాత తన కెరీర్ లో మరోసారి రాజమౌలి చేతిలో పెట్టాడు చెర్రీ. ఈ సినిమా చూడాలంటే సెకండాఫ్ వరకు వెయిట్ చేయాల్సిందే. 

 

అజ్ఞాతవాసి డిజాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. మనసు మార్చుకొని పింక్ రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమా ఎప్పుడు మొదలవుతుంది. ఎప్పుడు విడుదలవుతుందో ఎవ్వరూ చెప్పలేకపోయినా.. జనసేనానికి ఈ హిట్ చాలా అవసరం. 

 

మెగా ఫ్యామిలీలో హిట్ కావాల్సిన మరో హీరో బన్నీ. నా పేరు సూర్య తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకోకపోయినా.. గ్యాప్ వచ్చింది. సంక్రాంతికి తనకు కలిసొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి అల వైకుంఠపురంలో.. తో అదృష్టం పరీక్షించుకోనున్నాడు బన్నీ. 

 

గతేడాది ఎఫ్ 2తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకటేశ్.. ఇయర్ ఎండింగ్ లో వెంకీ మామతో ఒకే అనిపించుకున్నాడు. అయితే పూర్తి స్థాయిలో పెట్టుబడి రాబట్టలేకపోయింది. వెంకీమామ తర్వాత తమిళ హిట్ అసురన్ రీమేక్ లో నటించేందుకు రెడీ అవుతున్నాడు వెంకటేశ్. 

 

సక్సెస్ కోసం ఎదురు చూసిన ప్రతీసారి ఫెయిల్ అవుతున్న హీరో నాగార్జునే. సోగ్గాడే చిన్నినాయనా తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయే గానీ.. సక్సెస్ మాత్రం దక్కడం లేదు. తనదైన స్టైల్లో కొత్త దర్శకుడితో వర్క్ చేస్తూ.. వైల్డ్ డాగ్ మూవీగా కాప్ గా నటిస్తున్నాడు నాగార్జున. 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: