హీరోల క్రేజ్ వారి సక్సెస్ మీదే ఆధారపడి ఉంటుంది. ఏ హీరోకైనా సినిమా సక్సెస్ అయితేనే మళ్ళీ అతనికి మరో సినిమా ఛాన్స్ ఉంటుంది. వరుస పరాజయాలు వస్తుంటే ఆ హీరోకి క్రేజ్ తగ్గుతూ వస్తుంటుంది. ఈ విషయం స్టార్ హీరో సినిమాకి మరోలా ఉంటుండచ్చు అది వేరే సంగతి. కానీ మిడ్ రేంజ్ హీరోల పరిస్థితి మాత్రం అంతే. సినిమా హిట్ అయిందంటేనే వారి తర్వాతి సినిమా చూడడానికి జనాలు వస్తారు.

 

అయితే విజయ్ దేవరకొండ పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నం. విజయ్ కి గత కొన్ని రోజులుగా సరైన హిట్ పడలేదు. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన డియర్ కామ్రేడ్ పరాజయం పాలవడంతో అతని క్రేజ్ తగ్గిపోయిందనే వార్తలు వచ్చాయి. అప్పటి వరకు ఒక రేంజ్ లో ఉండేవాడు సడెన్ గా డౌన్ ఫాల్ అయ్యాడనే వార్తలు వచ్చాయి. తాజా పరిణామం విజయ్ క్రేజ్ ఎలాంటి ఢోకా లేదని చెప్తుంది.

 


విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న్ చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ టీజర్ ఇటీవల విడుదల అయింది. అయితే ఈ టీజర్ కి వచ్చిన స్పందన చూస్తుంటే విజయ్ క్రేజ్ ఇంకా తగ్గలేదని తెలుస్తుంది. విడుదల అయిన కొద్ది సేపట్లోనే మిలియన్ల వ్యూస్ రీచ్ కావడం అంటే చిన్న విషయం కాదు. వ్యూస్ తో పాటు లైక్స్ కూడా బాగానె వచ్చాయి. ఇదంతా చూస్తుంటే విజయ్ సినిమా కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్నారని అర్థం అవుతుంది.

 

మరి విడుదల అయ్యాక ఇదే క్రేజ్ ఉంటుందా లేదా చూడాలి. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. వారిలో ఐశ్వర్య రాజేష్, రాశీ ఖన్నా, ఇజబెల్ల, కేథరిన్ ట్రెసా ఉన్నారు. ప్రేమికుల రోజున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: