మలయాళ నటుడు దిలీప్‌ రెండేళ్లుగా సినీ నటి పై  సామూహిక లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే.  అప్పట్లో భావనపై ఆమె కారు డ్రైవర్ కిడ్నాప్ చేసి అత్యాచార యత్నం చేసిన విషయం సెన్సేషన్ సృష్టించింది.  ఈ విషయంలో గత రెండేళ్లుగా మలయాళం నటుడు దిలీప్ కుమార్ ఒక కేసు విషయంలో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అరెస్ట్ అయిన 85 రోజుల తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించిన దిలీప్ ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని పిటిషన్ దాఖలు చేశాడు. తనపై నమోదైన కేసులో పోలీసులు అన్యాయంగా, పూర్తి పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించాడు. అయితే  ఇటీవల దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌ విషయం దిలీప్ కి చేదు అనుభవం ఎదురైంది.

 

కాగా,  శనివారం కొచ్చి అదనపు స్పెషల్‌ సెషన్‌ కోర్టు డిశ్చార్జ్‌ పిటిషన్‌ కొట్టివేసింది. దిలీప్ పిటిషన్‌ను తిరస్కరించాలని విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ కోర్టును కోరిన అనంతరం న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసు విచారణను మరోసారి దిలీప్ ఎదుర్కోవాల్సి ఉంది. ట్రయల్‌ కోర్టు నిర్ణయంతో దిలీప్ హై కోర్టుకు వెళ్లే అవకాశం అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

 

గతంలో ఈ కేసు విషయంలో బాధితురాలు సుప్రీం కోర్టుని ఆశ్రయించి లైంగిక వేధింపులు జరిగిన సమయంలో తీసిన వీడియోను నిందితుడికి కానీ అతడి సన్నిహితులకు కానీ ఇవ్వకూడదని కోర్టుని కోరారు. దీనిపై కేరళ ప్రభుత్వం కూడా బాధితురాలికి సానుకూలంగా స్పందించింది.   గతేడాది ఫిబ్రవరిలో 33 ఏళ్ల నటిపై కొచ్చిలో దాడి జరిగింది. కారులో వెళ్తున్న నటిని పల్సర్ సునీల్ తో కూడిన గ్యాంగ్ అడ్డగించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించింది. మూడుగంటల పాటు ఆమెను కారులో లైంగికంగా వేధించారు. 


ఈ విషయం పోలీసులకు చెబితే ఈ సందర్భంగా తీసిన వేధింపుల వీడియోను సోషల్ మీడియాలో పెడతామని ఆమెను బెదిరించారు. అయితే, ఆమె అదే రోజు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదైన ఐదు నెలల తర్వాత దిలీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ,   తాను ఏ నటినీ కిడ్నాప్ చేయించలేదని, అదే నిజమైతే వేధింపులకు పాల్పడిన సమయంలో రికార్డయిన విజువల్స్ ఏవన్నా ఉంటే తనకు ఇవ్వాలనిమెజిస్ట్రేట్ కోర్టును కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: