బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. శ్రీముఖితో పోటాపోటీగా నడిచిన రాహుల్ ఫైనల్ గా విన్నర్ గా టైటిల్ అందుకున్నాడు. అంతేకాదు విన్నర్ కు ఇచ్చే 50 లక్షల ప్రైజ్ మనీ కూడా అందుకున్నాడు. హౌజ్ లో ఉన్నప్పుడే ప్రతి కంటెస్టంట్ ను టైటిల్ విజేతగా ప్రైజ్ మనీ గెలిస్తే ఏం చేస్తారని నాగార్జున అడిగాడు. అప్పుడు రాహుల్ తన తల్లిదండ్రులకు ఒక ఇల్లు కొంటానని అన్నాడు. అయితే విజేతగా గెలిచిన తర్వాత రాహుల్ ఇల్లు కొన్నాడో లేదో తెలియదు కాని లక్సరియస్ బెంజ్ కారు మాత్రం కొనేశాడు. 

 

బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక రాహుల్ కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. అతనికి సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. సింగర్ గానే కాదు హీరోగా కూడా రాహుల్ సినిమా ఛాన్సులు వస్తుండటం విశేషం. కృష్ణవంశీ రంగమార్తండా సినిమాలో రాహుల్, అలి రెజాలకు మంచి పాత్రలు దక్కినట్టు తెలుస్తుంది. అయితే టైటిల్ గెలిస్తే అమ్మానాన్నలకు ఇల్లు కొనిస్తా అని చెప్పిన రాహుల్ ప్రస్తుతానికి కారుని మాత్రం కొనేశాడు. అయితే ఇంటికి ఇంకా కొత్త మొత్తం కావాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నాలు ఆపి ఉండొచ్చు.

 

బెంజ్ లక్సరీ కారు అంటే దాని స్టార్టింగ్ మోడల్ 30 లక్షల నుండి ఉంది. రాహుల్ కొన్న కారు కూడా బాగానే రేటు ఉంటుందని తెలుస్తుంది. ఓ పక్క సింగర్ గా మరింత బిజీగా మారబోతున్న రాహుల్ సిపిలిగంజ్ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకోవడం చూస్తుంటే రాహుల్ కు బిగ్ బాస్ బాగా కలిసి వచ్చిందని చెప్పొచ్చు. బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులను మెప్పించిన రాహుల్ సినిమాల్లో ఎలా అలరిస్తాడో చూడాలి. రాహుల్ తో పాటుగా అతని పార్ట్ నర్ గా పునర్నవికి అవకాశాలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: