టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని తెలుగు అగ్ర కథానాయకుడిగా టాలీవుడ్‌లో తన రభస కొనసాగిస్తునే ఉన్నాడు. అంతేకాదు తనదైన డాన్స్, ఫైట్స్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు.  ఇక టెంపర్ నుంచి అపజయం అంటూ ఎరగని జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు. అయితే ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌కు త‌మిళంలో కూడా క్రేజ్ పెరుగుతున్న‌ట్టు తెలుస్తోంది.  అరవింద సమేత, జనతా గ్యారేజ్ సినిమాలు తమిళంలో కూడా ఆకట్టుకున్నాయి. దీనితో తారక్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట.

 

అక్కడ కూడా మార్కెట్ ఉంటుందని, నిర్మాత కూడా సిద్దంగా ఉన్నారని ఆ దర్శకుడు తారక్ కి చెప్పినట్టు సమాచార౦. ఇటీవల షూటింగ్ లో గ్యాప్ వచ్చిన సమయంలో ఆ కథను వినిపించారట. దీనికి తారక్ కూడా ఆసక్తి చూపించి సంక్రాంతి తర్వాత తాను ఫ్రీ గా ఉంటాను అని.. అప్పుడు కథను వింటాను అని చెప్పినట్టు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. కాగా, ప్ర‌స్తుతం దర్శకధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. టాలీవుడ్ అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

 

తారక్ కొమరం భీమ్ పాత్రలో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా విషయంలో పక్కా ప్రణాళికను వేసుకోన్న రాజమౌళి.. దాని ప్రకారంగా షూటింగ్‌ను కానిచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 70శాతానికి పైగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. అలాగూ ఈ మూవీలో అలియా భట్, ఒలివియా మోరస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: