మితిమీరిన అభివృద్ధి ఎన్ని అనర్దాలకు మూలం అవుతుందో తరచుగా మనం చూస్తూనే ఉన్నాం. వింటూనే ఉన్నాం. అలాగే చాలామంది ఆకతాయి కుర్రాళ్లు కూడా అమ్మాయిలు, ఆంటీలు అనే బేధం లేకుండా, తల్లి వయస్సు ఉన్న మహిళలతో కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇది ఒకరి సమస్య కాదు. ప్రతి సంస్దలో ఉన్న మహిళ ఉద్యోగి సమస్య. ప్రతి రంగంలో ఆడవారు ఎదుర్కొంటున్న సమస్య. కళాశాల విద్యార్ధినిలు, పోలీసు డిపార్ట్ మెంట్ దగ్గరి నుండి సెలబ్రిటీలు కూడా ఈ వేధింపులను గురవుతూనే ఉన్నారు.

 

 

వాట్సప్ గ్రూపులు మెయింటెన్ చేస్తూ, అసభ్య సందేశాలు పంపడం. ఫోన్ నంబర్స్ తీసుకుని వేధించడం ఇలాంటివి ఎక్కువైయ్యాయి.  అంతే కాకుండా సెలబ్రిటీలకు ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో ఎదురయ్యే వేధింపులు అన్నీ ఇన్నీ కావు. ఇక సినీ ప్రముఖుల వేధింపుల విషయానికీ వస్తే, ఎన్ని తిట్లు తిట్టినా భరించక ఏం చేస్తారు అనుకుంటారో ఏమో తెలీదు కానీ ఈ మధ్య ట్రోలింగ్ మితి మీరిపోతోంది.

 

 

తాజాగా ప్రముఖ గాయని కౌసల్య సైబర్ వేధింపుల బారిన పడ్డారు. తన ఫోన్ నెంబర్ తెలుసుకుని రోజూ దరిద్రమైన మెసేజ్‌లు పంపిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ తన బాధను వ్యక్తం చేశారు. ఒక మహిళ సెలబ్రిటీ అయినా మేము మాములు మనుషులే.. మాకు కూడా మనసు ఉంటుంది. అని వాపోయిందట కౌసల్య.

 

 

ఇకపోతే సింగర్ కౌసల్యకు అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పంపించే ఆకతాయిలు ఒకరు ఇద్దరు కాదట.. వందల్లో చేరారట. ఆ బాధలు తట్టుకోలేక వారి నంబర్స్ బ్లాక్ చేస్తుంటే, మరో నెంబర్స్ నుండి.. ఇలా చాలసార్లు విసిగిపోయిన కౌసల్య ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 342 కాంటాక్ట్స్‌‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందట. ఆయినా మెసేజ్‌లు అప్పటికి ఆగకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేపట్టారట. త్వరాలోనే వీరి తాట తీస్తామంటున్నారని కూడా హెచ్చరించారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: