సంక్రాంతి సీజన్ లో వార్ మొదలవబోతోంది. ఆ వార్ కి సిద్దమవుతున్న సినిమాల్లో 'అల వైకుంఠపురములో'ఒకటి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రారంభం నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతూ మూడు నెలల ముందు నుంచి ప్రేక్షకులను ఆకట్టుకునేలా పబ్లిసిటి చెయ్యడంతో సినిమాకు భారీగా హైప్ పెరిగింది. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఒక సినిమాపై హైప్ ఆకాశాన్ని తాకుతోంది అంటే ఆ ఇంపాక్ట్ రెండవ సినిమాపై  పడుతుంది. సినిమాలో కంటెంట్ బాగుండి.. ప్రేక్షకులకు కనెక్ట్ అయితే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. బాక్సాఫీస్ లెక్కలను తిరగరాస్తుంది. పొరపాటున కానీ సినిమా అంచనాలు అందుకోలేకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా చతికిల పడే అవకాశాలు ఉంటాయి. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎక్కడివరకో ఎందుకు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'అజ్ఞాతవాసి' ఒక ఉదాహరణ. అంతేకాదు మహేష్ బాబు - మురుగదాస్ ల 'స్పైడర్' కూడా మంచి ఉదాహరణగా కనిపిస్తుంది.

 

'అల వైకుంఠపురములో' సినిమాకు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కానీ టీజర్ కు మాత్రం మిగతా సినిమాల మాదిరిగా స్పందనే వచ్చింది. బన్నీ స్టైలిష్ గా కనిపించడం తప్ప కొత్తగా ఏమీ లేదని కూడా కొందరు బాగానే కామెంట్ చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే సన్నాఫ్ సత్యమూర్తి కనిపిస్తోందని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య త్రివిక్రమ్ ట్రాక్ రికార్డు కూడా ఏమంత గొప్పగా లేదు. ఇది ప్రత్యేకంగా చెప్పనవసరం  లేదు. అసలు గతంలో ఉన్న మ్యాజిక్ ఇప్పుడు గురువు గారు చేయలేకపోతున్నాడని చెప్పుకుంటున్నారు. 'అజ్ఞాతవాసి' త్రివిక్రమ్ ఇమేజ్ ను బాగా దెబ్బ తీసిన సంగతి తెలిసిందే. అయితే 'అరవింద సమేత' ఏదో సోసో అనిపించుకుంది కానీ చెప్పుకునేంత గొప్పగా ఏమీ లేదు. ఆ సినిమా కూడా అంచనాలను అందుకోలేకపోయింది. వాస్తవంగా చెప్పాలంటే అరవింద ను తారక్ కాపాడాడని చెప్పాలి. తన పర్‌ఫార్‌మెన్స్ తో సినిమాని తన భుజాల మీద వేసుకొని కాస్త గట్టెక్కించాడు. 

 

ముఖ్యంగా 'పెనిమిటి' సాంగ్ కు రిలీజ్ అయిన సమయంలో ఆహా ఓహో అన్నారు.. ఈ పాటకు తిరుగులేదు అన్నారు.  సాహిత్యం.. గానం.. సంగీతం అన్నీ సూపర్ కానీ చిత్రీకరణ ఆ పాట లోని ఆత్మను పూర్తిగా దెబ్బతీసింది. పాటలోని భావానికి ఆ చిత్రీకరణకు పొంతన లేకపోవడంతో చాలామంది ఆడియన్స్ యాంకర్ సుమ తరహాలో అవాక్కయ్యారు.  అదేంటో కానీ ఈ విషయంపై పెద్దగా చర్చలు జరగలేదు.. ఇలాంటి అంశాలు 'అరవింద సమేత'లో ఇంకా కొన్ని ఉన్నాయి. మరి 'అల వైకుంఠపురములో' సినిమా విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకున్నాడా లేక ఆదమరచాడా అని ఒకరకమైన కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే గనక జరిగితే మాత్రం ఈ సినిమాపై ఉన్న హైప్ రివర్స్ లో ఎఫెక్ట్ చూపించి రిజల్ట్ బెడిసి కొట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. అసలే బన్నీ కి నా పేరు సూర్య తో ఫ్లాప్ పడింది. ఆ ఫ్లాప్ ని కవర్ చేయడానికి చాలానే ట్రై చేస్తున్నారు గాని ఏం జరుగుతుందో త్వరలో తెలియనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: