మోహిత్‌ సూరి దర్శకత్వంలో, అనిల్ కపూర్ ప్రధాన పాత్రల్లో, ఆదిత్య రాయ్‌ కపూర్‌, దిశా పటాని, జంటగా తెరకెక్కిన సినిమా 'మలంగ్‌'.  ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి నటీనటులను పరిచయం చేస్తూ, చిత్రయూనిట్ ఒక్కో పోస్టర్‌ను విడుదల చేస్తుంది. అందులో భాగంగానే హీరోహీరోయిన్లకు సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్‌ హాట్ టాపిక్‌గా మారింది.

 

 

ఇకపోతే ఈ సినిమాలో ఆదిత్య రాయ్‌ కపూర్‌ భూజాల మీద కూర్చొని దిశ అతడి లిప్‌ లాక్‌ చేస్తున్నట్టుగా ఉన్న స్టిల్‌ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇక ఎప్పుడైతే ఈ స్టిల్‌ విడుదల చేసారో, అప్పటి నుండి ఈ సినిమా మీద ఆసక్తి పెరిగిపోయింది. ఇక ఇంత ఘాటు రొమాన్స్‌ పోస్టర్‌లోనే కనిపిస్తే, ఇంకా ఈ సినిమాలో ఏ స్థాయిలో ఉంటుందో అన్న టాక్‌ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా కాల్విన్ క్లెయిన్ లో దుస్తుల‌కు ప్ర‌చార క‌ర్త‌గా మారిన నటి దిషా ప‌టాని గ‌త కొంత కాలంగా సోష‌ల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్‌లో వ‌రుస ఫొటోల‌తొ ర‌చ్చ చేస్తున్న విష‌యం తెలిసిందే.

 

 

ఇకపోతే ఈ సినిమాలో ఓ కిస్‌ సీన్‌లో నటించేందుకు హీరో హీరోయిన్లు పెద్ద సాహసమే చేశారట. అదేమంటే హీరో హీరోయిన్లకు రెండు రోజుల పాటు ప్రత్యేకంగా ట్రైనింగ్‌ ఇచ్చారు. ఈ సినిమాలో అండర్‌ వాటర్‌లో ఓ కిస్‌ సీన్‌ ఉంది. ఆ సీన్ దాదాపు నిమిషం నిడివి ఉంటుందట. ఇక ఈ సీన్‌లో నటించేందుకు, చిత్రయూనిట్, హీరో హీరోయిన్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారట. అంతసేపు అండర్‌ వాటర్‌లో నటించేందుకు వారి లంగ్‌ కెపాసిటీని పెంచేందుకు ట్రైనింగ్ ఇచ్చారట.

 

 

సింగిల్‌ షాట్‌లోనే ఈ ముద్దు సన్నివేశాన్ని తీశారట చిత్ర బృందం.. ఇక ఈ పిక్‌పై దిషా ఫ్యాన్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తుండగా, కొంత మందేమో ద్యావుడా! అని, కొంత మంది మాత్రం నిజంగా ఇలాంటి ముద్దు కావాలంటే అమ్మాయిలు ట్రై చేయండి అని కామెంట్‌లు పెడుతుండగా, ఆమె ప్రియుడు టైగ‌ర్ ష్రాఫ్ ప‌రిస్థితేంట‌ని, మ‌రి కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: