ఒకే వేదికపై సూపర్ స్టార్, మెగాస్టార్ కలిస్తే ఎలా ఉంటుంది.. వినడానికే ఊహ అదిరిపోయింది కదూ.. అదే నిజమైతే మరి.. అవునండీ.. ఈ రోజు జరగబోయే మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ప్రత్యేక అతిధిగా విచ్చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్‌.బి స్టేడియం గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్ కూడా ఉంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మెగా సూపర్ ఈవెంట్‌లో స్పెషల్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వనుంది. ఇక అది హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం.

 

డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ  ``పొద్దునే కొడుకు ప‌ట్టాడు. సాయంత్రం స‌రిలేరు సినిమా ఫంక్ష‌న్ ఇలాంటి ఫీలింగ్ నెవ్వ‌ర్ బిఫోర్‌.. ఎవ్వ‌ర్ ఆఫ్ట‌ర్‌. మెగాస్టార్ చిరంజీవిగారు, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌గారు, విశ్వ‌న‌ట‌భార‌తి, మా రాములమ్మ విజ‌య‌శాంతి.. ముగ్గురినీ చూస్తుంటే ఆకాశంలోని స్టార్స్ అన్నీ నేల‌మీదుకు వ‌చ్చిన‌ట్లు అనిపిస్తున్నాయి. నా జీవితంలో మ‌ర‌చిపోలేని రోజుది. ప్ర‌తి మ‌నిషిలో క‌ళ పుట్ట‌డానికి ఓ క‌ళ ఉంటుంది. అలాంటి క‌ళ పుట్ట‌డానికి చిరంజీవిగారే కార‌ణం. నాలో పుట్టిన మొద‌టి క‌ళ డాన్స్‌. 

 

చిన్న‌ప్పుడు అబ్బ‌నీ తీయ‌ని దెబ్బ పాట‌కు డాన్స్ చేస్తే జామెంట్రీ బాక్స్ ఇచ్చారు. ల‌వ్‌మీ మై హీరో పాట‌కు డాన్స్ చేస్తే స‌బ్బు పెట్టి ఇచ్చారు. సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న ఈ సినిమాకు సంక్రాంతి ముగ్గులా అందం తెచ్చిన న‌టి విజ‌య‌శాంతిగారు. ఈ సినిమాలో పాత్ర‌ను ఆమె ఒప్పుకుని న‌టించినందుకు ఆమెకు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను. ఆమెను త‌ప్ప ఈ పాత్ర‌కు మరొక‌రిని ఊహించుకోలేక‌పోయాను. ఆమె గొప్ప న‌ట‌న‌ను చూపించారు. ప‌వ‌ర్ ఆఫ్ ఉమెన్‌ను ఈసినిమాలో ఆమె త‌న న‌ట‌న‌తో చూపించారు. రాజేంద్ర‌ప్ర‌సాద్‌గారు, ప్ర‌కాశ్‌రాజ్‌గారు, ర‌ష్మిక‌, సంగీత‌గారు, రావు ర‌మేష్‌గారు స‌హా అంద‌రికీ థ్యాంక్స్‌. నాతో పాటు ప‌నిచేసిన మా టెక్నీషియ‌న్స్‌కి థ్యాంక్స్‌. ర‌త్న‌వేలుగారు అద్భుత‌మైన విజువ‌ల్స్ ఇచ్చారు. డిసెంబ‌ర్ అంతా దేవిశ్రీగారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రీరికార్డింగ్ ఇర‌గొట్టేశారు. ఈ సినిమాలో సూప‌ర్‌స్టార్ కృష్ణ‌గారు కూడా ఉంటారు. ఆయ‌నెలా ఉంటార‌నేది సినిమాలో చూడాల్సిందే. ప్ర‌కాశ్‌గారు అద్భుత‌మైన ఆర్ట్ వ‌ర్క్ ఇచ్చారు. నా హోం బ్యాన‌ర్‌లో నేను చేసిన ఐదో సినిమా ఇది. అనీల్ సుంక‌ర‌గారితో తొలిసారి ప‌నిచేశాను. అడిగిన‌వ‌న్నీ స‌మ‌కూర్చారు. ఎఫ్ 2 షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు మ‌హేశ్‌గారికి ఈ క‌థ చెప్పాను. క‌థ విని.. సినిమా చేస్తున్నామ‌ని చెప్పిన క్ష‌ణాలు.. ఫిబ్ర‌వ‌రిలో పిలిచి సినిమా క‌థ చేయ‌మ‌ని చెప్పిన క్ష‌ణాలు. జూలై నుండి ఇప్ప‌టి వ‌ర‌కు నేను ఆయ‌న‌తో చేసిన ప్ర‌తి క్షణం నా జీవితంలో నేను గుర్తు పెట్టుకునే ఉంటాను. నాకు పెద్ద అవ‌కాశం ఇచ్చారు. ఆయ‌న నాకు ఏమిచ్చారు అనేదానికి రేపు జ‌న‌వ‌రి 11న మంచి హిట్ ఇచ్చి తిరిగి ఇవ్వాల‌ని అనుకుంటున్నాను. సినిమా బాగా వ‌చ్చింది. జ‌న‌వ‌రి 11న బొమ్మ ద‌ద్ద‌రిల్లిపోతుంది`` అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: