టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు పై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో ఎంతో వైభవంగా జరుగగా, ఈ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి ఫంక్షన్ ని మరింత సక్సెస్ చేశారనే చెప్పాలి. ఇక ముందుగా మెగాస్టార్ తమ ఫంక్షన్ కు రావడం ఎంతో గొప్ప విషయం అని చెప్పిన మహేష్ బాబు, ఆయన ఎందరికో ఇన్స్పిరేషన్ అని, 

 

అలానే ఎంత వయసు పెరిగినప్పటికీ కూడా వర్క్ పట్ల ఆయనకు ఉండే డెడికేషన్ చూస్తే, ఆయన ఎందుకంత గొప్ప మెగాస్టార్ అయ్యారో అందరికీ అర్ధం అవుతుందని అన్నారు. ఇక కాసేపటి తరువాత మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, తనకు మొదటి నుండి మహేష్ బాబు పై ప్రత్యేకమైన అభిమానం ఉండేదని, అలానే మహేష్ కు మంచి సక్సెస్ లభించినప్పుడల్లా, తనకు ఎంతో సంతోషంగా ఉండేదని చెప్పిన మెగాస్టార్, తాను మా ఇంట్లో బిడ్డ వంటి వాడని అన్నారు. ఇక మహేష్ తో మాట్లాడుతున్నంతసేపు ఎంతో సరదాగా ఉంటుందని, ఆయనలోని చిలిపితనంతో పాటు ఆయన ఒకరకమైన దొంగ అని అంటూ సరదాగా కామెంట్స్ చేసారు చిరు. 

 

ఇక ఇటీవల తాను ఒక పేపర్ తిరగేస్తున్నపుడు అందులో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కనపడిందని, అందులో మహేష్ ని అలాగే చాలాసేపు తదేకంగా చూస్తూ ఉండిపోయానని అన్నారు. ఇక తండ్రి కృష్ణ గరివలె మహేష్ కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాడని, తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి మహేష్ కు మరొక సూపర్ హిట్ అందివ్వాలని అన్నారు. అలానే ఈ సినిమాతో పాటు సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న మిగతా సినిమాలు కూడా హిట్ కావాలని కోరుకుంటున్నట్లు మెగాస్టార్ తెలిపారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: