మాస్ మహ రాజ్ రవితేజ హీరోగా వి.ఐ ఆనంద్ డైరక్షన్ లో వస్తున్న సినిమా డిస్కో రాజ. నభా నటేష్, రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన హైలెట్ పాయింట్ ఒకటి రివీల్ అయ్యింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్నాళ్లుగా సరైన హిట్ లేని రవితేజసినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. డిస్కో రాజా సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తుంది. ఈ సినిమాలో అసలు ఎవరు లేని రవితేజ మీద అతనితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు కొందరు ప్రయోగం చేస్తారట.

 

అయితే ఆ ప్రయోగానికి ముందు ఒకళా ప్రయోగానికి తర్వాత మరోలా ప్రవరిస్తాడట రవితేజ. ఈ సీన్స్ చాలా హైలెట్ గా ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా ఆ సన్నివేశాల్లో రవితేజ నటన సినిమాకు చాలా ప్లస్ అవుతుందని అంటున్నారు చిత్రయూనిట్. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో హిట్ అందుకున్న వి.ఐ ఆనంద్ ఆ తర్వాత అల్లు శిరీష్ తో ఒక్క క్షణం సినిమాతో నిరాశపరచాడు. అయితే మళ్లీ డిస్కో రాజాతో అతని సత్తా చాటాలని చూస్తున్నాడు. సినిమా రవితేజకు హిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

 

సినిమా విషయంలో రవితేజ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. సినిమా దాదాపు షూటింగ్ పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత రవితేజ గోపిచంద్ మలినేని డైరక్షన్ లో క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో రవితేజ మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు రవితేజ. మరి డిస్కో రాజాతో హిట్ కొడితే ఆ తర్వాత వచ్చే క్రాక్ కూడా అదే హిట్ ట్రాక్ కొనసాగించేలా ఉంటుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: