కొందరు హీరోయిన్స్ పెళ్లితర్వాత నటించడం మానేసి, భర్త, పిల్లలు, ఇళ్లు అంటూ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే చాలని ఇంట్లోనే ఉంటూ ఇతర బిజినెస్‌లు చూసుకుంటారు. పెళ్లితర్వాత హీరోయిన్ పాత్రల్లో నటించే హీరోయిన్స్ ను వేళ్లమీద లెక్కపెట్టవచ్చూ. ఇకపోతే అక్కినేని వారి కోడలు వీటన్నీటికి భిన్నంగా సినిమాలు చేసుకుంటూ, హిట్లమీద హిట్లు  కొట్టుకుంటు వెళ్లుతుంది.

 

 

అంతే కాదు తన అందంతో చూసే వారిని చంపేస్తుంది. చిలిపి నవ్వు, మైకం కమ్మే కళ్లతో కైపెక్కిస్తున్న సమంత అందానికి ఫిదా కానీ వారుండరు. ఇదే కాకుండా గ‌త ఏడాదిగ‌త ఏడాది త‌మిళంలో సూప‌ర్ డీల‌క్స్‌, తెలుగులో మ‌జిలీ, ఓ బేబీ అంటూ కొత్త త‌ర‌హా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇక బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూడు సినిమాలు భారీ విజ‌యాల్ని సాధించడమే కాకుండా సామ్‌ నటనకు ప్ర‌శంస‌ల్ని అందించాయి. అదే ఊపును కంటిన్యూ చేస్తూ ప్ర‌స్తుతం స‌మంత తెలుగులో 96, హిందీలో ఫ్యామిలీమ్యాన్ -2 వెబ్ సిరీస్‌లో న‌టిస్తోంది. ఈ రెండు చిత్రాలు ఫుల్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి.

 

 

ఇకపోతే ఇలా షూటింగ్‌లతో ఎంత బిజీగా వున్నా సమంత అప్పుడప్పుడు త‌న ఫ్యాన్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి ఈ సుందరి నాటీ ఫొటోల‌తో గిలిగింత‌లు పెట్టేస్తుంటుంది. తాజాగా అలాంటి కొన్ని ఫొటోల‌ని స‌మంత సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. లైట్ రోజ్ క‌ల‌ర్ సారీలో కుందనపు బొమ్మలా, చూసే వారి గుండెల్లో గుబులు పుట్తేలా కనిపించి, కనిపించని అందాలతో ఫోజు ఇచ్చిన ఫొటోలు ఫ్యాన్స్‌ని మెస్మ‌రైజ్ చేస్తున్నాయి. ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించుకున్న ఈ సారీలో స‌మంత మునుప‌టి క‌న్నా అందంగా జిగేల్ మంటూ ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తోంది.

 

 

ఇక శ‌నివారం రాత్రి జీ సినీ అవార్డ్స్ ఈ కార్య‌క్ర‌మంలో సూప‌ర్ డీల‌క్స్ చిత్రానికి గానూ స‌మంత‌కు ఉత్త‌మ‌న‌టిగా స్పెష‌ల్ జ్యూరీ అవార్డు వచ్చిన సందర్భంగా ప్ర‌త్యేకంగా ఓ డిజైన‌ర్‌తో గులాబి వ‌ర్షంలో మెరిసిపోయే సారీని డిజైన్ చేయించుకుని ధరించి ఉన్న ఫొటోలో సామ్ పెట్టిన పోజు, ఆమె న‌డ‌ముకున్న టాటూకి అర్థ‌మేంట‌ని అంతా సర‌దాగా కామెంట్ చేస్తున్నారట. ప్రస్తుతం సామ్ ఎట్రాక్ట్ చేస్తున్న ఈ ఫొటోలు ఇన్‌స్టాలో వైర‌ల్ అవుతున్నాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: