టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యాడు ఎన్టీఆర్.  నందమూరి హరికృష్ణ తనయుడైన ఎన్టీఆర్ అచ్చం సినియర్ ఎన్టీఆర్ రూపం కొట్టొచ్చినట్టు ఉండే ఎన్టీఆర్, ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘స్టూడెంట్ నెం.1’ మూవీతో హీరోగా వెండి తెరకు పరిచయం అయ్యారు.  మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ నందమూరి కుర్రాడో తర్వాత వరుసగా విజయాలు అందుకుంటూ వచ్చాడు.  అప్పట్లో ఎన్టీఆర్ పర్సనాలిటీ హెవీగా ఉండటంతో కొన్నికామెంట్స్ వినిపించాయి.  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ’ మూవీలో పూర్తిగా సన్నబడిపోయి.. యంగ్ యముడి పాత్రలో తాతకు తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.  ప్రస్తుతం సినిమా హీరోలు పలు పెద్ద పెద్ద కంపెనీలకు అంబాసిడర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్న విషయం తెలిసిందే.

 

తెలుగు లో మహేష్ బాబు, దేవరకొండ విజయ్, ఎన్టీఆర్ ఇటీవల నేచురల్ స్టార్ నాని కూడా ఓ యాడ్ లో కనిపిస్తున్నారు.  ప్రస్తుతం పార్లే అగ్రో దక్షిణ భారతదేశంలో తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ బేవరేజ్ కంపెనీ పార్లే అగ్రో తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌‌‌‌తో యాప్పీ ఫిజ్ కోసం బ్రాండ్ అంబాసిడర్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.   ఐతే తాజాగా ఆ ప్రకటన చిత్రీకరణలో పాల్గొన్న ఎన్టీఆర్ లుక్ కిరాక్ గా ఉంది. రెడ్ టి షర్ట్ పై బ్లాక్ జాకెట్ ధరించి ఇంటెన్స్ లుక్స్ ఇస్తున్న ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయింది.  బాలీవుడ్ లో ఈ యాడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ కనిపిస్తున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

 

ఈ మద్యనే విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ జరిపారు. ఈ షెడ్యూల్ నందు కేవలం ఎన్టీఆర్ మాత్రమే పాల్గొన్నాడు. తదుపరి షెడ్యూల్ కి బ్రేక్ దొరకడంతో ఎన్టీఆర్ ఇలా ఒప్పందమైన వ్యాపార ప్రకటనలలో పాల్గొంటున్నట్లు సమాచారం.  మొత్తానికి రెడ్ టి షర్ట్ పై బ్లాక్ జాకెట్ ధరించి ఇంటెన్స్ లుక్స్ ఇస్తున్న ఎన్టీఆర్ గెటప్ అదిరిపోయింది. ఆర్.ఆర్.ఆర్ లో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని తెరపై చూడాలని తహతహలాడుతున్న ఫ్యాన్స్ కి ఇలా ప్రకటనలలో దర్శనమిస్తూ వారికి కొంచెం ఉపశమనం కలిగిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: