అల్లుఅర్జున్ కధానాయకుడిగా పూజ హెగ్డే కధానాయికగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆలా వైకుంఠపురములో. ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులకు ఇప్పటికే విడుదలైన పాటలు.. టీజర్ బాగా నచ్చశాయి. అయితే నిన్న విడుదల అయినా ట్రైలరే కొంచం తేడా కొడుతుంది. 

                    

ఇప్పటి వరుకు విడుదలైన మాటలలో కొన్ని మాస్ సాంగ్స్ ఉన్నాయి.. కానీ ట్రైలర్ లో మాత్రం అలా లేదు.. మరోసారి త్రివిక్రమ్ తనదైన శైలిలో క్లాసీగానే వెళుతున్నాడా?  మాస్ కి కాస్త దూరంగానే వెళుతున్నాడా? అన్న సందేహం కలగజేసేలా క్లాసీ ట్రైలర్ తో వచ్చాడు త్రివిక్రమ్. మిడిల్ క్లాస్ స్ట్రగ్లింగ్ కుర్రాడి కథే.

                       

చిన్నప్పటి నుంచి నా లైఫ్ లో ఆహా అనుకునే ఒక్క రోజు కూడా లేదు!! ఇది రియాలిటీ .. ఆల్మోస్ట్ యూత్ కి ఎదురయ్యే రియాలిటీ లైన్ తీస్కున్న త్రివిక్రమ్ దానికి కార్పొరెట్ బ్యాక్ డ్రాప్.. సాఫ్ట్ వేర్ నేపథ్యం.. భారీ బిల్డింగులతో పెద్ద కుటుంబాలతో లంకె వేసాడు. ఇక ఇందులో టబు లాంటి సీనియర్ తో మురళి శర్మ లాంటి డాడీతో.. జయరాం- సుశాంత్ లాంటి క్లాసీ మనుషులతో బన్నీకి ఏంటి? అన్నది తెరపై చూడాలి. 

 

అయితే గతంలోను త్రివిక్రమ్ బన్నీ కలిసి జులాయి లాంటి అద్భుతమైన చిత్రం తీశారు. ఇప్పుడు ఈ సినిమాలో కాస్త జులాయి లుక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే తండ్రి స్టైల్.. అదే కొడుకు స్టైల్.. మాస్ గా కనిపించిన మాస్ సన్నివేశాలు మాత్రం ఎం లేవు.. మరి చివరికి ఎం అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: