సాధారణంగా దేవుడు అంటే భక్తి.... దేయ్యం అంటే భయం అని ఎవరికైనా తెలిసిందే.  దేవుడు అంటే ఎంత భక్తి ప్రపత్తులతో ఉంటారో.. దెయ్యం అంటే అంత గజ గజ వణికిపోతాారు.  ప్రపంచంలో ఎవరికైనా ఇది సర్వ సాధారణం.  ఇక దేవుడి పై ఎన్ని సినిమాలు వస్తున్నాయో.. దెయ్యం పై కూడా అన్ని సినిమాలు వస్తున్నాయి.  మానవుడు నమ్మకాన్ని బట్టి ఎవరి నిర్ణయం వారికి ఉంటుంది.  అయితే దెయ్యం ఉందని నమ్మెవారు చాలా మంది ఉన్నారు. అందులో సెలబ్రెటీలు కూడా ఉన్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటి అంజలి ఈ విషయం పై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  తెలుగు, తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది నటి అంజలి.  విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమెల్లె చెట్టు’ మూవీలో ఏంటో నాకు అన్నీ అలా తెలిసిపోతాయ్ అంటూ అమాయకంగా నటించి అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా అందరి మనసు దోచింది నటి అంజలి. 

 

ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా పెద్దా గుర్తింపు తెచ్చుకోని ఈ విజయవాడ బ్యూటీ ‘గీతాంజలి’ సినిమాలో దెయ్యం పాత్రలో నటించి భయపెట్టింది.  అలాంటి అంజలి నిజ జీవితంలో దెయ్యానికి భయపడిపోయిందట.   ఓ యూట్యూబ్ ఛానల్ లో  మాట్లాడుతూ ఆమె ఈ విషయాన్ని చెప్పింది.  నేను ఇప్పుడు ఉంటున్న ఇంట్లో కాకుండా అంతకుముందు ఒక ఇంట్లో వుండే దానిని. ఆ ఇంట్లో దెయ్యం వుందనిపించేది.

 

రాత్రి 12 గంటలు కాగానే ఆ దెయ్యం వచ్చి నన్ను నిద్రలేపుతుందనిపించేది. ఆ భయంతో ఒక్కోసారి రాత్రికి రాత్రే హోటల్ కి వెళ్లి ఆ రాత్రికి అక్కడ రూమ్ తీసుకుని పడుకున్న రోజులున్నాయి.  అయితే దెయ్యం ఉందో లేదో తనకు తెలియదు కానీ తన మనుసుకు మాత్రం అలా భయం అనిపించేదని.. దాంతో ఆ ఇంట్లో నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపానని ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి  దెయ్యం భయం కారణంగానే ఆ ఇల్లు ఖాళీ చేసేసి వేరే ఇంటికి మారిపోయాను. ఇప్పుడు అంతా ప్రశాంతగా వుంది  అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: