టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ కు కేవలం నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్, ఎంత త్వరగా సినిమా చూస్తామా అని ఎంతో ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించగా, రత్నవేలు ఫోటోగ్రఫిని అందించారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్ లో అదిరిపోయే వ్యూస్, లైక్స్ సంపాదించుకుని ఇంకా దూసుకుపోతోంది. 

 

ఇకపోతే ఈ సినిమాలో తమన్నా, డ్యాంగ్ డ్యాంగ్ అనే స్పెషల్ సాంగ్ లో మహేష్ బాబుతో కలిసి చిందేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ అంశమే సరిలేరుకు కలిసి వచ్చే అవకాశం ఉందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా తమన్నా పలు సినిమాల్లో అక్కడక్కడా ఈ విధంగా స్పెషల్ సాంగ్స్ లో నటించడం జరిగింది. కాగా వాటిలో మెజారిటీ సినిమాలు మంచి సక్సెస్ సాధించాయని, ఆ విధంగా ఈ సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా సక్సెస్ అవకాశం ఉందని అంటున్నారు. 

 

గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఫస్ట్ సినిమా అల్లుడు శ్రీను, ఇటీవల యాష్ హీరోగా తెరకెక్కిన కెజిఎఫ్, అలానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జైలవకుశ సినిమాల్లో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్స్ మంచి క్రేజ్ సంపాదించడంతో పాటు ఆ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో, తప్పకుండా ఆమె స్పెషల్ సాంగ్ చేసిన సరిలేరు నీకెవ్వరు కూడా సూపర్ హిట్ కొట్టడం ఖాయం అని తేల్చేస్తున్నారు. మరి తమన్నా సెంటిమెంట్ ఈ సినిమాకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: