ఇటీవల మూడేళ్లుగా స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోకు మొదట్లో అంతగా ఆదరణ లభించదని, ఎందుకంటే ఇటువంటి రియాలిటీ షోలు మన తెలుగు వారు ఆదరించరని కొందరు భావించారు. అయితే అటువంటి వారి ఆలోచనలు తలక్రిందులు చేస్తూ ప్రారంభమయిన తొలి సీజన్ మంచి ప్రేక్షకాదరణతో అద్భుతమైన రేటింగ్స్ తో దూసుకుపోయింది. కాగా ఆ తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తరువాత రెండవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని, అలానే ఇటీవల జరిగిన మూడవ సీజన్ కు కింగ్ నాగార్జున హోస్టులుగా వ్యవహరించడం జరిగింది. 

 

ఇకపోతే మొన్న నూతన సంవత్సరం 2020 ప్రవేశించడంతో ఈ ఏడాది మరొక ఆరు నెలల్లో ప్రారంభం కాబోయే తదుపరి బిగ్ బాస్ సీజన్ 4 కు హోస్టుగా ఎవరు వ్యవహరిస్తారు అనే దానిపై ప్రేక్షకులు ఇప్పటినుండే చర్చించడం మొదలెట్టేసారు. మొదట్లో ఈ 4వ సీజన్ కు మెగాస్టార్ చిరు హోస్ట్ గా వస్తారని వార్తలు వచ్చాయి, ఆ తరువాత రవితేజ, విక్టరీ వెంకటేష్ వంటి స్టార్ హీరోల పేర్లు తెరమీదకు వచ్చి ప్రచారం అయ్యాయి. అయితే అటువంటి పుకార్లన్నిటికీ తిలోదకాలిస్తూ, ఇటీవల స్టార్ మా ఛానల్ తాజా సీజన్ కు హోస్ట్ గా ఒక స్టార్ హీరోని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని అంటున్నారు. 

 

అయితే ఎన్టీఆర్ ని ఈ సీజన్ కు హోస్ట్ గా తీసుకోవడానికి ముఖ్య కారణం, ఇప్పటివరకు ప్రసారం అయిన మూడు సీజన్స్ లోకి నాగ్ హోస్ట్ చేసిన మూడవ సీజన్ కు ఎక్కువ రేటింగ్స్ వచ్చాయని, అయితే ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న మొదటి సీజన్ కు కూడా దాదాపుగా ఆ స్థాయిలోనే రేటింగ్స్ రావడంతోపాటు, సరిగ్గా షో నిర్వహించే జూన్ సమయానికి ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసుకుని ఫ్రీ అవుతారని భావించి, ఆయనను సంప్రదించగా, ఆయన కూడా హోస్ట్ గా వ్యవహరించేందుకు సుముఖత చూపారని అంటున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: