జ‌బ‌ర్ద‌స్త్ అనేది చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. ఇందులో సుడిగాలి సుధీర్ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఏడేళ్లుగా తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తూనే ఉన్నాడు. ఇక ఇటీవ‌ల‌ టాలెంటెండ్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా కూడా మారారు. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమ‌య్యాడు. సుధీర్, ధన్య బాలక్రిష్ణ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రాజశేఖర్‌రెడ్డి పులిచర్ల దర్శకత్వం వ‌హించ‌గా.. కె. శేఖర్‌రాజు నిర్మించారు.


 
సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా సుధీర్ డ్యాన్స్ ఆకట్టుకుంది. ఏదేమైనా కామెడీతో పాటు సుధీర్ డ్యాన్స్‌తోనూ మరోసారి అదరగొట్టి ఫ్యాన్స్‌ను అలరించడం విశేషం. ఇదిలా ఉంటే.. టీవీ షోలతో పాటు యాంకర్, డాన్సర్, మెజీషియన్‌, హీరోగా కూడా సత్తా చూపిస్తున్నాడు సుధీర్. క ఇప్పుడు ఈయన డేట్స్ హాట్ కేక్స్‌లా మారాయి. అంటే 30 రోజులు ఫుల్ బిజీగానే ఉంటున్నారు సుధీర్. దీంతో ఆస్తులు కూడా బాగానే పోగేసుకుంటున్నాడు ఈయన. అయితే సుడిగాలి సుధీర్ ఆస్తి విలువ ఎంతుంది అని తెలుసుకోడానికి అభిమానులు కూడా ఆసక్తిగానే ఉన్నారు. 

 

ఈయన ప్రస్తుత ఆస్తి లెక్కలు కడితే దాదాపు 3 కోట్ల నుంచి 5 కోట్ల మధ్యలో ఉంటుందని తెలుస్తుంది. ఏడాదికి కనీసం 25 నుంచి 35 లక్షలు మధ్యలో సంపాదిస్తున్నాడు సుధీర్. కాగా,  జబర్దస్త్ షోతో పాటు ఢీ ఛాంపియన్స్, పోవే పోరా లాంటి షోలు, ఇతర ఈవెంట్స్ కూడా ఉన్నాయి. దానికితోడు సినిమాలు కూడా చేస్తుండటంతో సుధీర్ బాగానే వెనకేసుకుంటున్నాడు. ఇక జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో నుంచే కాకుండా బ‌య‌ట కూడా సుడిగాలి సుధీర్ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. మిగిలిన వాళ్ల‌తో పోలిస్తే.. ఈయ‌న‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: