టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా... టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అలా వైకుంఠపురములో. ఈ సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తూ వచ్చింది. ఎందుకంటే ఇప్పటికే ఈ ఇద్దరి  కాంబినేషన్లో తెరకెక్కిన జులాయి సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇకపోతే మూడోసారి కూడా హిట్ కొట్టడం ఖాయమని ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. కాగా  అలా వైకుంఠపురములో  సినిమా నుంచి విడుదలైన పాటలు రికార్డులు సృష్టించాయి. ట్రైలర్కు కూడా అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇకపోతే ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అలా వైకుంఠపురములో ట్రైలర్ అందరిని ఆకర్షించినప్పటికీ బన్నీ ఫాన్స్ లో మాత్రం ట్రైలర్ చూశాక ఓ భయం పట్టుకుందట. 

 

 

 ప్రస్తుతం అలా వైకుంఠపురం సినిమాలో బన్నీ ఫ్యాన్స్ అందరిని ఆ అంశం ఇప్పుడు విపరీతంగా భయపెడుతుంది. అదేంటంటే ట్రైలర్ లో  మొత్తం అల్లు అర్జున్ ను  మాత్రమే హైలెట్ చేయడం విశేషం. ఇకపోతే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మీద ఎప్పుడు నుంచో ఒక అపవాదు ఉందన్న విషయం తెలిసిందే. కుటుంబ కథా చిత్రాలు చేసేటప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ లెక్కకు మించిన పాత్రలను సినిమాలో పెట్టి ఏ పాత్రకు కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వరు అని ఒక టాక్ ఉంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ కామెడీ సరిగ్గా పేలడం లేదు. ఇవన్నీ పక్కనపెడితే బాక్సాఫీస్ దగ్గర అలా వైకుంఠపురం సినిమాకు సరిలేరు నీకెవ్వరు సినిమాతో గట్టిపోటీ నెలకొంది. సరిలేరు నీకెవ్వరు సినిమా లో కూడా హిట్ కాంబినేషన్ కావడంతో బన్నీ ఫాన్స్ లో కాస్త భయం పట్టుకుందట. 

 

 

 ఎందుకంటే కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి మలచిన  సినిమాలన్ని  విజయాలతో దూసుకుపోతున్నాయి . అంతేకాకుండా మహేష్ బాబు కూడా ఇప్పటికే హ్యాట్రిక్ సాధించి ఒక రేంజ్ లో బాక్సాఫీస్  షేక్  చేస్తున్నారు. ఇకపోతే దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ కూడా ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది. అంతే కాకుండా సరిలేరు నీకెవ్వరు సినిమాలో  అన్ని పాత్రలను సమానంగా ప్రాధాన్యం  ఉంచినట్లు ఇప్పటికే ట్రైలర్ లో కూడా అర్థమైంది. దీంతో ఒకవేళ త్రివిక్రమ్ మళ్ళీ అదే పొరపాటు చేసి ఉంటే మాత్రం అల వైకుంఠపురములో  సినిమాకి మైనస్ అవుతుందని బన్నీ  అభిమానులు భయపడుతున్నారట. చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలలో ఏ సినిమా నిలిచి గెలుస్తుందనేది .

మరింత సమాచారం తెలుసుకోండి: