స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అల వైకుంథపురములో. ఇటీవల ఈ సినిమా గ్రాండ్ గా మూజికల్ కాన్సర్ట్స్ ని జరుపుకుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త తాజాగా వైరల్ అవుతోంది. సాధారణంగా మన సినిమా ఇండస్ట్రీ లో నమ్మకాలకు ఇచ్చిన ప్రాముఖ్యత గురించి అందరికి తెలిసిందే. అలాంటివి పాటిస్తేనే సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకంలో చాలా చేసేస్తుంటారు. ఇప్పుడు అల వైకుంఠపురములో టీం కూడా అలాంటి సెంటిమెంట్ ను నమ్ముకున్నట్లు గా కనిపిస్తోంది. ఈ సంక్రాంతి సీజన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే మ్యూజిక్ సూపర్ హిట్టైపోయింది. 

 

ఎక్కడకు వెళ్లినా.. అల వైకుంఠపురము లో పాటలే వినిపిస్తున్నాయి. దాంతో ఈ సినిమా వసూళ్ల దుమ్ము రేపటం ఖాయమన్న కాన్ఫిడెన్స్ తో చిత్ర యూనిట్ ఉంది. రేపటి (గురువారం) నుంచి వరుస పెట్టి సంక్రాంతి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. 9న దర్బార్.. 11న సరిలేరు నీకెవ్వరు.. 12న అల వైకుంఠపురములో.. 15న కల్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు విడుదల కానున్నాయి. ఈ నాలుగు సినిమాల్లో ఏది బ్లాక్ బస్టర్ హిట్  సాధిస్తుందన్న ఉత్కంఠతో అందరు ఎదురుచూస్తున్నారు.
అన్ని సినిమాలు హిట్ కావాలి.. మా సినిమా కూడా హిట్ కావాలంటూ తన కోరికను తాజాగా వెల్లడించారు అల వైకుంఠపురములో హీరో అల్లు అర్జున్. అందులో భాగంగానే తాజాగా కొన్ని సెంటిమెంట్లను కూడా ఈ చిత్ర యూనిట్ ఫాలో అవుతుందని చెబుతున్నారు.

 

అల వైకుంఠపురములో సినిమా టైటిల్ ను ఇంగ్లిషు లో రాయాలంటే ‘Ala Vaikunthapurramuloo’ సరి పోతుంది. కానీ.. గూగుల్ లో మాత్రం 'Ala Vaikuntapuramlo' 'Ala Vaikuntapuramulo' 'Ala Vaikuntapuramuloo' ఇలా చాలా స్పెల్లింగుల్లో కనిపిస్తోంది. అయితే.. వీటికి భిన్నంగా చిత్ర యూనిట్ మాత్రం మాత్రం ‘‘Ala VaikunthapuRRamuloo’’ అనే స్పెల్లింగ్ కు ఫిక్స్ అయ్యింది. మిగిలిన వాటికి దీనికి తేడా ఏమిటంటే.. మధ్యలో వచ్చే ‘ఆర్’ లు రెండు ఉండటం. అవసరానికి మించిన ఒక ఆర్ ను అదనంగా చేర్చటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలా ఎందుకు అంటే న్యూమరాలజీ ప్రకారం ఇలా ఇంగ్లీష్ టైటిల్ లో ఒక అక్షరం చేర్చడం వల్ల సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందట. మరి అల టీం ఫాలో అయిన ఈ సెంటిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: