టాలీవుడ్ లో ఒకప్పుడు తన క్లాసిక్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు దర్శకులు, నిర్మాత ఎంఎస్ రాజు. 'శత్రువు', 'దేవి', 'మనసంతా నువ్వే', 'ఒక్కడు', 'వర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' లాంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలు అందించింది.  నిర్మాతగా, దర్శకుడిగా అందమైన ప్రేమకథలను తెరకెక్కించిన ఎంఎస్‌ రాజు ఇప్పుడు మాత్రం ట్రెండ్‌ మార్చాడు. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ కి తగ్గట్టుగా ఓ బోల్డ్‌, డర్టీ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  డర్టీ హరి అనే మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఎంఎస్ రాజు. కొద్ది రోజులుగా మూవీకి సంబంధించి ఒక్కో పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ మూవీపై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.  

 

హీరో పాత్ర‌ధారి శ్ర‌వ‌ణ్ రెడ్డి లుక్‌ రిలీజ్ చేశారు.. ఈ పోస్టర్ లో హీరో బాత్ టబ్ లో పడుకోవడం.. అతనికి ఓ లేడీ సిగరేట్ నోట్లో పెట్టడం చూపించారు.  అయితే ఈ పోస్టర్ పై చాలా విమర్శలు వచ్చాయి.. ఈ మూవీ ఏ ఉద్దేశంతో తీస్తున్నారని ప్రశ్నలు సంధించారు నెటిజన్లు. తర్వాత గోల్డ్ కలర్ శారీ ధరించి ట్రెడిషనల్ లుక్ లో ఉన్న రుహని శర్మ లుక్… ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే దీనిపై మాత్రం ఎన్నో ప్రశంసలు గుప్పించారు ఆడియన్స్.  తాజాగా మరో హాట్ ఫోటో రివీల్ చేశారు.  జాస్మిన్ పాత్ర పోషిస్తున్న సిమ్ర‌త్ కౌర్ పోస్ట‌ర్ విడుద‌లైంది.

 

ఇందులో సిమ్ర‌త్ చాలా హాట్‌గా క‌నిపిస్తుంది. ఎంఎస్‌ రాజు దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాను ఎస్పీజే క్రియేషన్స్‌ బ్యానర్‌పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్‌లు నిర్మిస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే చిత్ర రిలీజ్ డేట్ ప్ర‌క‌టించ‌నున్నారు. ఏదిఏమైనా ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో డర్టీ హరి చిత్ర యూనిట్ సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: