ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. స్టార్ హీరోల మధ్య పోటీ ఉండటం సహజమే, కానీ ఆ పోటీని కుటుంబ బందాలకు అన్వయించుకుంటున్నట్లుగా కొన్ని కొన్ని వేడుకల్లో సృష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఏ వేడుక అయినా పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడా లేకుండా కుటుంబంలోని ఆర్టిస్ట్‌లు అందరు హాజరై ఆవేడుకకు నిండుదనాన్ని చేకూర్చేవారు.

 

 

కానీ ఈ మధ్యకాలంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇది ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో కనిపిస్తుందని ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయట. ఈ గుసగుసలను నిజం చేస్తున్నట్లుగా అలవైకుంఠపురంలో సినిమా ప్రమోషన్‌ కోసం మెగా ఫ్యామిలీ నుండి ఒక్క హీరో కూడా హాజరవకపోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా ఈ వార్తల వెనుక ఎవరికి తెలియని మర్మం దాగుందనే అభిప్రాయాన్ని చాలా మంది వెలిబుచ్చుతున్నారట. ఇదే కాకుండా అల్లు అర్జున్‌ తన ‘అల వైకుంఠపురములో’ సినిమా ప్రమోషన్‌ కోసం ఇప్పటివరకు కూడా మెగా కాంపౌండ్‌ నుంచి ఒక్క హీరోని కూడా ఎందుకు ఉపయోగించుకోలేకపోయాడు.? అనే ప్రశ్న ప్రతివారి మెదళ్లను తొలిచేస్తుందట.

 

 

ఇదే కాకుండా బన్నీ తలుచుకుంటే ఈ సినిమా ప్రమోషన్‌ కోసం రామ్‌చరణ్‌ని రప్పించొచ్చు, పవన్‌ కళ్యాణ్‌నీ ఆహ్వానించొచ్చు.. చిరంజీవిని అడిగితే కాదనే అవకాశమే లేదు. కనీసం నాగబాబు కూడా ‘అల వైకుంఠపురములో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హాజరు కాకపోవడం ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేస్తుందట.. ఇకపోతే ఇప్పుడు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చ, ‘అల వైకుంఠపురములో’ సినిమాకి పెద్ద మైనస్‌గా మారుతోందని అనుకుంటున్నారట..

 

 

ఈ మధ్యకాలంలో తమ సినిమాల ప్రమోషన్‌ కోసం ఇతర హీరోల్ని కలుపుకుపోవడం చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్దితుల్లో అల్లు అర్జున్‌ అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడంలో అర్ధం ఏంటో ఎంతగా ఆలోచించిన అంతుచిక్కడం లేదట. ఇక అల్లు అర్జున్‌ వ్యవహారశైలి నిజానికి, ఇది కాదు. కానీ మొత్తానికి బన్నీ మారాడు అని సృష్టంగా ఇక్కడ అర్ధం అవుతుంది. కానీ తనలోని మార్పు బన్నీకి నెగెటివిటీని తెచ్చిపెడుతోందని తెలుస్తుంది.

 

 

అల్లు అర్జున్‌, ఈ కొత్త వ్యవహార శైలిని అంటించుకోకుండా వుండి వుంటే సంక్రాంతి సీజన్‌లో ‘అల వైకుంఠపురములో’కి అడ్వాంటేజ్‌ మరింత పెరిగేదేమో. కానీ తన మాటల వల్ల, చేతల వల్ల ఒక వర్గం ప్రేక్షకులకు దూరం అవడం వల్ల ఆ ప్రభావం ఈ సినిమా పై పడే అవకాశముందని కొందరు అంచనా వేసుకుంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే ఈ చిత్రం విడుదల వరకు వేచి చూడవలసిందే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: