‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ కు విపరీతమైన స్పందన రావడంతో ప్రస్తుతం యూట్యూబ్ లో అది నెంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో ఉన్న కామెడీకి చాలమంది కనెక్ట్ అవుతున్నారు. దీనితో ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ హిట్ అంటూ ప్రచారం మొదలైపోయి ఈసినిమా సాధించబోయే రికార్డుల గురించి అప్పుడే అంచనాలు మొదలు పెట్టేసారు. గ్రౌండ్ రియాలిటీ మాత్రం ఈ సినిమా కి విడుదలకి ముందు కాస్తంత ఇబ్బందికరంగానే ఉంది. ప్రస్తుత తరుణం లో మహేశ్ బాబు కొత్త సినిమా మీద ఆశలు పెట్టుకున్న డిస్ట్రిబ్యూటర్ లు ఏ రకమైన రిజల్ట్ వస్తుందా అని టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు.. మరొక పక్క దుబాయ్ సెన్సార్ నియమ నిబంధనల ప్రకారం ఒక సినిమా వారి దేశంలో విడుదల కావాలి అంటే ఆ మూవీని ఖచ్చితంగా వారం రోజులు ముందుగా సెన్సార్ చేయించి తీరాలి.

 

 

అయితే ‘అల’ ‘సరిలేరు’ మూవీల విషయంలో ఇప్పటికే దుబాయ్ సెన్సారింగ్ కార్యక్రమాలు పూర్తి అయినా చాల వ్యూహాత్మకంగా ఈ మూవీలకు సంబంధించిన దుబాయ్ టాక్ ను బయటకు రానీయకుండా ఈ మూవీల నిర్మాతలు చాల జాగ్రత్తలు తీసుకున్నట్లు టాక్ వినపడుతోంది. సరిలేరు’ ట్రైలర్ లో ‘మేజర్ చంద్రకాంత్’, అతడు మూవీ పోలికలు ఉన్నాయనే ట్రోల్స్ సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి.

 

 

అలాగే మ‌హేష్ అత‌డు సినిమాను కూడా కొంత పోలి ఉంద‌ని.. స్టిల్స్‌, లుక్స్ అలాగే ఉన్నాయని మ‌హేష్ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు... వాటిపై అనిల్ కానీ సినిమా యూనిట్ కానీ పట్టించుకోవడం లేదు. ఈ ట్రోలింగులు భారీగా వైర‌ల్ అవుతున్నాయి.  దీనిని మహేశ్ ఫాన్స్ డిఫెండ్ చెయ్యగలుగుతున్నారు కానీ సరిలేరు బృందానికి సంబంధించిన వారు ఎవరైనా కలుగజేసుకుని ఏవైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే ధోరణి వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎంతవరకూ వెళ్ళి ఆగుతుంది అనేది చూడాలి మరి ..

మరింత సమాచారం తెలుసుకోండి: