ఈ కాలంలో ప్రేమించడంలేదని అమ్మాయిలపై అఘాయిత్యాలు చేయడం ఎక్కువ అయిపోతున్నాయి.. యాసిడ్ పోయడం, చంపేయడం, దాడి చేయడం లాంటివి ఎక్కువ అయిపోతున్నాయి... ప్రేమ అనేది మనసుకు సంబందించిన విషయం.. బలవంతం గా ఒకరిపై ప్రేమ పుట్టాలంటే పుట్టదు... అలా అని ప్రేమించడం లేదని ఆ అమ్మాయిని హింసిస్తే అది దారుణం..

 

అలాంటి ఒక యాసిడ్ భాదితురాలు యొక్క జీవిత చరిత్రని ఆధారంగా తీసుకుని తీస్తున్న సినిమా "చపాక్ "మేఘనా గుల్జార్‌ రూపొందించిన ఈ చిత్రంలో "దీపికా పదుకునె "హీరోయిన్ గా నటిస్తుంది.. యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది.. తాజాగా ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా గూర్చి కంగనా భావోద్వేగానికి గురిఅయ్యారు..

 

నటి దీపిక కి థాంక్స్ చెప్పారు.. ఇంత గొప్ప చిత్రంలో నటిస్తున్నందుకు ధన్యవాదములు తెలియచేసారు..  దీపిక నటన తన సోదరి రంగోలిని గుర్తుచేసిందని భావోద్వేగానికి గురయ్యారు. గొప్ప సినిమాను తెరకెక్కించారంటూ చిత్ర బృందానికి కృతఙ్ఞతలు తెలియజేశారు. ఛపాక్‌ ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. నా సోదరి రంగోలి చెందేల్‌కు ఎదురైన అనుభవాలు మరోసారి గుర్తుకువస్తున్నాయి. విపత్కర సమయంలో రంగోలి చూపిన ధైర్యం, కఠిన పరిస్థితుల్లో తను వ్యవహరించిన తీరు నాకెంతగానో స్ఫూర్తినిచ్చింది. తన చిరునవ్వు నన్ను విషాదం నుంచి తేరుకునేలా చేస్తుంది’ అని ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్‌ చేశారు.

కాగా కంగనా సోదరి రంగోలిపై గతంలో యాసిడ్‌ దాడి జరిగిన సంగతి తెలిసిందే. ప్రేమను నిరాకరించినందన్న కారణంతో ఓ వ్యక్తి ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు. యాసిడ్‌ ధాటికి తన అవయవాలు కరిగిపోవడంతో వాటి కోసం ఐదు సంవత్సరాల వ్యవధిలోనే 54 సర్జరీలు జరిగాయి. అయితే ఇప్పటికీ డాక్టర్‌లు రంగోలి చెవి భాగాన్ని మాత్రం పునర్నిర్మించలేకపోయారు. ఈ విషయాల గురించి రంగోలి గతంలో అభిమానులతో పంచుకున్నారు.

 

ఇంత గొప్ప చిత్రం చేసినందుకు చిత్రం యూనిట్ కి అభినందనలు తెలియచేసారు.. అలాగే దీపికా మీద ఇపుడు సోషల్ మీడియా లో కొంతమంది మండిపడుతున్నారు.. జేఎన్‌యూలో విద్యార్థులకు పరామర్శించినందుకు గానూ దీపికను నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘ఛపాక్‌ను బాయ్‌కాట్‌ చేయాలి..అని కొంతమంది విమర్శలు చెస్తున్నారు.. కానీ దీనికి భిన్నంగా కంగనా.... దీపికా సినిమా కి సపోర్ట్ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: