ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో పరిస్థితులు బాగా మారిపోతున్నాయి. ముఖ్యంగా హీరోల రెమ్యూనరేషన్ విషయంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మన దగ్గర స్టార్ హీరోలు తమ సినిమాలకు ముందే రెమ్యూనరేషన్లు తీసుకోవడం మంచిదా.. లేకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా లాభాల్లో వాటా తీసుకోవడం మంచిదా ..అంటే ఇండస్ట్రీ బావుండాలంటే మాత్రం సినిమా హిట్ అయిన తర్వాత లాభాల్లో షేర్ తీసుకోవడమే మంచిది అంటున్నారు.

 

కానీ ఇలా చేసే హీరోలు కొద్దిమందే. బాలీవుడ్ లో ఆమిర్ ఖాన్ లాంటి స్టార్స్ ఈ పద్ధతే ఫాలో అవుతుంటారు. తెలుగులో కూడా ఈమధ్య కొందరు స్టార్ హీరోలు అదే పద్దతి ఫాలో అవుతున్నారు. కానీ మన టాలీవుడ్ స్టార్స్ రెమ్యూనరేషన్ విధానంలో కొంత మార్పు ఉంది. ఇది నిర్మాతలకు లాభమన్న సంగతేమో కానీ నష్టం రావడమే ఎక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. 'సరిలేరు నీకెవ్వరు'కు మహేష్ రెమ్యూనరేషన్ విషయం కూడా అలానే ఉందట.

 

'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు మహేష్ ముందే రెమ్యూనరేషన్ తీసుకోలేదని.. దీనివల్ల ఎంతో నిర్మాతకు మేలు జరుగుతుందని మెగాస్టార్ చిరంజీవి 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపారు. అయితే ఈ విషయం చిరంజీవి చెప్పినట్టు ఏమీ లేదని ఆ నెక్స్ట్ డే నుండే సెటైర్లు పడుతున్నాయి. ఈ సినిమాకు మహేష్ బాబు ఎడ్వాన్స్ కూడా తీసుకోలేదన్నది నిజమే అయినా మహేష్ అసలు రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే తీసుకుంటున్నారని అంటున్నారు. మహేష్ నటించిన గత రెండు సినిమాలకు.. రాబోయే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకు కలిపి మొత్తం నాన్ థియేట్రికల్ రైట్స్ కు 150 కోట్లు అందుకున్నారని టాక్. ఈ అగ్రిమెంట్ లో లాస్ట్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' అని చెప్పుకుంటున్నారు.

 

ఒక్క 'సరిలేరు నీకెవ్వరు' పారితోషికం విషయమే తీసుకుంటే నాన్ థియేట్రికల్ రైట్స్ ను రూ. 55 కోట్లకు అమ్మినట్టు సమాచారం. ఇది కాకుండా సినిమా థియేట్రికల్ కలెక్షన్స్ పై వచ్చే లాభాల్లో 30% శాతం కూడా తీసుకుంటున్నారని అంటున్నారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం మహేష్ కు ఏమాత్రం నష్టం ఉండదట. ఆ నష్టం మొత్తం భరించాల్సింది నిర్మాత.. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే. ఈలెక్కన మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్టుగా మన స్టార్ హీరోలు ముందుగా రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమా చేసినందువల్ల నిర్మాతలకు పెద్దగా ఒరిగేదేమీ లేదని ఇండస్ట్రీ సీనియర్లు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు ఒకవేళ భారీ బడ్జెట్ తో తీసిన సినిమా గనకైతే అది ఫ్లాపైతే నిర్మాత చేతిలో మిగిలేదై చిప్పే అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: