సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా నటిస్తున్న తాజా సినిమా దర్బార్. మాస్, కమర్షియల్ సినిమాల దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆదిత్య అరుణాచలం అనే పక్కా మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజిని నటిస్తుండగా, విలన్ గా బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, అలానే ఒక కీలక పాత్రలో యువ హీరోయిన్ నివేత థామస్ నటిస్తున్నారు. ఇక ఇటీవల యువ సంగీత దర్శకుడు అనిరుద్ దర్శకత్వంలో స్వరపరచబడిన సాంగ్స్ తో పాటు థియేట్రికల్ ట్రైలర్ కూడా రజిని ఫ్యాన్స్ ని, ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై భారీగా అంచనాలు పెంచేయడం జరిగింది. 

 

ఇకపోతే నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ షో టాక్ ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ సినిమా షోలను నిన్న అర్ధ రాత్రి యుఎస్ఏ, దుబాయ్, యూఏఈ లలో వేయడం జరిగింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం, సినిమాలో రజిని ఎంట్రీ అదిరిందని, ఇక ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా వచ్చే కొన్ని కామెడీ సీన్స్, సాంగ్స్, కీలక యాక్షన్ సీన్స్ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్, సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ ల్యాగ్ లు ఉన్నాయని, అయితే కొంత సినిమా గడిచిన తరువాత సినిమా మరింత పుంజుకుంటుందని, 

 

యాక్షన్ సీన్స్, ఫైట్ సీన్స్ తో పాటు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ఎంతో ప్లస్ పాయింట్ అవుతుందని అంటున్నారు. ఓవర్ ఆల్ గా చెప్పాలంటే, మంచి యాక్షన్ కథాంశంతో కూడిన సినిమాలు కోరుకునేవారితో పాటు ముఖ్యంగా రజిని ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎంతో నచ్చుతుందని అంటున్నారు. రజిని స్టైల్, మాస్ ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్ సీన్స్ తో పాటు రెండు సాంగ్స్ సినిమాలో ఎంతో బాగున్నాయని, మొత్తంగా ఈ సినిమా ఎబోవ్ యావరేజ్ నుండి హిట్ గా నిలిచే అవకాశం కనపడుతుందని అంటున్నారు. అయితే నేడు రెండు, మూడు షోలు గడిచిన తరువాతనే పూర్తి స్థాయిలో టాక్ బయటకు రానుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: