ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం సినిమాల్లోకి కొత్తగా వస్తున్న నటీనటులు మరింతగా ఎక్కువయ్యారు. అయితే వారిలో కొందరు మంచి పేరుతో, టాలెంట్ తో దూసుకుపోతుంటే మరికొందరు మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. ఇక కన్నడ భాషలోకి ఇటీవల సినిమాల మీద మక్కువతో అడుగుపెట్టిన యువ హీరో రాజ్ సూరియన్, తానే సొంతంగా అమోఘ్ ఎంటర్‌ప్రైజెస్ అనే బ్యానర్ స్థాపించి హీరోగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. 
ఇక ఇటీవల తెలుగులో తిరుగుబోతు, జటాయువు అనే సినిమాల్లో కూడా నటించాడు. ఇక ప్రస్తుతం మై నేమ్ ఈజ్ రాజా అనే సినిమాలో నటిస్తున్నాడు.

 

అయితే మొదట్లో నటించిన రెండు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కానప్పటికీ, నటుడిగా తనకు అవి మంచి సంతృప్తిని ఇచ్చాయని, అందుకే ప్రస్తుతం నటిస్తున్న మై నేమ్ ఈజ్ రాజా సినిమా కోసం మరింతగా కష్టపడ్డానని అన్నారు. ఉపేంద్ర వద్ద శిష్యుడిగా పని చేసిన అశ్విన్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ అని, అలానే హీరో క్యారెక్టర్ లో మూడు రకాల షేడ్స్ ఉన్నాయని దర్శకుడు అన్నారు. అయితే హీరో రాజ్ సూరియన్ ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలనే సంకల్పంతో దీనిని డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ఇటీవల జరుపడం జరిగిందని, 

 

అయితే సినిమాకు సెన్సార్ వారు మాత్రం సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నాడు. ముందుగా సెన్సార్ కు దరఖాస్తు చేసుకున్న సినిమాలను ప్రక్కన పెట్టి, చివరిలో వచ్చిన సినిమాలకు ముందుగా సెన్సార్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే ఇక్కడి పద్ధతులు ఇలానే ఉంటాయని అంటున్నారట. మరోవైపు తమ సినిమాను ఈనెల 31న రిలీజ్ చేయాలని డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాము అని, మిగతా కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నప్పటికీ సెన్సార్ సమస్యలతో సినిమా సమయానికి రిలీజ్ అవుతుందో లేదో అనే అనుమానం కలుగుతోందని అంటున్నాడు.......!!

మరింత సమాచారం తెలుసుకోండి: