తమిళ సూపర్ స్టార్ రజినీకాంతో కబాలి, కాలా, పెట్టా లాంటి మాఫియా తరహా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ప్రేక్షకుల ముందుకు కొత్త తరహాలో రావాలిని చూస్తున్న ఆయనకు స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తోడయ్యారు.  ఏఆర్ మురగదాస్, రజినీ కాంబినేషన్ లో వస్తున్న ‘దర్భార్’ మూవీలో పూర్తిగా రజినీ లుక్ చేంజ్ చేశారు.  ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లో ర‌జ‌నీ నుంచి ఎలాంటి సినిమా, స్టైల్‌, మేన‌రిజం ఉన్న సీన్లు ప్రేక్ష‌కులు ఆశిస్తారో మురుగ‌దాస్ అలాంటి సినిమాయే తీశాడు... క‌థ కొత్త‌గా లేక‌పోయినా ప్ర‌తి సీన్‌లోనూ ద‌ర్శ‌కుడు త‌న‌దైన స్టైల్లో ర‌జ‌నీ మార్క్ మేన‌రిజం, ఉండేలా చూసుకున్నాడు. 

 

నేడు ప్రపంచ వ్యాప్తంగా ‘దర్భార్ ’మూవీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.  గత కొంత కాలంగా అంటే ‘లింగా’ మూవీ నుంచి రజినీకాంత్ కి సరైన హిట్ లేదు.  లింగా తర్వాత వచ్చిన కబాలి, కాలా మూవీస్ ఘోరమైన పరవాభవాన్ని చూశాయి.  కాకపోతే రజినీ మానియాతో కొంత డబ్బులు వసూళ్లు చేసినా ఆయన కెరీర్ పరంగా ఈ మూవీస్ డిజాస్ట్ అని చెప్పొచ్చు.  ఇక పెట్టా మూవీ తెలుగులో పేటా అని రిలీజ్ చేశారు.  ఈ మూవీ కాస్త డిఫరెంట్ గా తెరకెక్కించారు.. కాస్త పరవాలేదు అనిపించుకుంది.  అయితే ఇఫ్పుడు మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ‘దర్భార్’ పూర్తి భిన్నంగా ఉండబోతుందట. 

 

నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలపై ఓ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న అంశంతో ఈ మూవీ సాగబోతుందట.  ఇటీవల దిశ కేసు లో తెలంగాణపోలీసులు తీసుకున్న నిర్ణయం తెలిసిందే.. ఆ తరహాలో ఈ మూవీ ఉండబోతుందా.. అన్ని విషయం కొద్ది సేపట్లో తెలియబోతుంది.  మొత్తాని పోలీస్ గా రజినీ కనిపించడం ఫ్యాన్స్ కి పండుగే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: