నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ తర్వాత బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడన్న సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత బన్నీ నుండి వస్తున్న చిత్రమిది. అయితే త్రివిక్రమ్ తో ఈ సినిమా చేస్తున్నప్పుడే బన్నీ మరో రెండు సినిమాలని కూడా ప్రకటించాడు. అందులో ఒకటి సుకుమార్ తో ఉండగా, మరొకటి ఎమ్ సీ ఏ ఫేమ్ వేణు శ్రీరామ్ తో ఉంది.

 

అయిత్ త్రివిక్రమ్ తో సినిమా అనంతరం బన్నీ సుకుమార్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అల వైకుంఠపురములో ప్రమొషన్లలో బిజీగా ఉన్న బన్నీ సినిమా విడుదల తర్వాత సుకుమార్ తో చేసే సినిమాలో రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేయనున్నాడు. ఈ సినిమా సమ్మర్ లో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. మరి వేణు శ్రీరామ్ తో సినిమా ఎప్పుడు ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.

 

వేణు శ్రీరామ్ తో చేసే సినిమాకి "ఐకాన్" అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. లోగోతో సహా అన్ని లాంఛన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రం ఉంటుందా ఉండదా అనే సందేహాలు మొదలవుతున్నాయి. అయితే ఈ విషయమై బన్నీ కాంపౌండ్ లోని నిర్మాత అయిన బన్నీ వాసు నుండి ఒక క్లారిటీ వచ్చింది. బన్నీ ఐకాన్ సినిమాని క‌చ్చితంగా చేస్తాడ‌ని అత‌న‌న్నాడు. బ‌న్నీకి ఐకాన్ క‌థ ఎంతో న‌చ్చింద‌ని.. అత‌డిక‌ది భిన్న‌మైన సినిమా అవుతుంద‌ని.. ఒక హానెస్ట్ మూవీలా దాన్ని చేయాల‌ని బ‌న్నీ అనుకుంటున్నాడ‌ని వాసు వెల్ల‌డించాడు. 

 


ఐతే ఆ సినిమా ప‌క్కాగా ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌ని మాత్రం చెప్ప‌లేమ‌న్నాడు. ప్రస్తుతానికి వేణు శ్రీరామ్ ని తన పని చూసుకోమని చెప్పాడట బన్నీ. సుకుమార్ సినిమా అయిపోయి ఖాళీ దొరకగానే వేణు శ్రీరామ్ తో కలిసి ఐకాన్ ని పట్టలెక్కిస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: