రాజమౌళి పతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ . జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే డెభ్బై ఐదు శాతం షూటింగ్ ని కంప్లీట్ చేసుకుంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టిఆర్ కొమరం భీం గా కనిపించనుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నాడు. ఎన్టీఆర్ సరసన బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ మెరవనుంది.

 


ఇక ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో ఎవరు కనిపిస్తున్నారో చెప్పిన విషయం తెలిసిందే. హాలీవుడ్ నటులని ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రల్లో తీసుకున్నారు. కొమరం భీంగా ఎన్టీఆర్ నిజాం ప్రబువుని ఎదిరించే సన్ని వేశాల్ని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చిత్రీకరించారట. ప్రస్తుతం విశాఖ షెడ్యూల్ ని కంప్లిట్ చేసుకుని మరో షెడ్యుల్ కి సిద్ధం అవుతోంది. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాటని ప్రజా గాయకుడు గద్దర్ పాడబోతున్నాడట.

 


కొమరం భీమ్‌పై ఓ పాట రాయమని రాజమౌళి, గద్దర్‌ను అడిగినట్లు తెలుస్తోంది. ఇక ఆ ఆఫర్‌ను గద్దర్ కాదనలేక పోయారని., అందుకే ఓ పాటను రాసి పాటబోతున్నారని సమాచారం. అంతేకాదు ఈ పాట సినిమా హైలెట్‌లలో ఒకటిగా నిలవనుందని తెలుస్తోంది. విప్లవ గేయాలు రాయడంలో దిట్ట అయిన గద్దర్ పాటలు ఎలాంటి ఊపుని కలిగిస్తాయో అందరికీ తెలిసిందే. ఇంకా ఆయన గొంతు నుండి ఆ పాట వచ్చిందంటే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

 

ఇలాంటి పాటలే సీతారామరాజు పాత్రకి కూడా ఉండే అవకాశం ఉంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అభిమానులని ఉర్రూతలూగిస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఈ సంవత్సరం జులై 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో విడుదల అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: