ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తలైవా రజనీకాంత్ ఫ్యాన్స్ కలల పండుగ రోజైన నేడు ఎట్టకేలకు దర్బార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. తమిళనాడు, కర్ణాటక సహా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున ఈ సినిమాని రిలీజ్ చేశారు. కొన్ని వేల థియేటర్లలో, లక్షలాది షోలు ప్రదర్శితమవుతున్న ఈ సినిమాకు ఇంకా టికెట్లు దొరక్క కొంత మంది ఫ్యాన్స్ అల్లాడుతున్నారు. అయితే గతంలో రజనీకాంత్ నటించిన 2.0, పేట సినిమాలు పర్వాలేదనిపించినా, రజిని ఫ్యాన్స్ ఆశించిన రేంజ్ లో మాత్రం అవి హిట్ కాలేదనే చెప్పాలి. దానితో ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ దర్బార్ సినిమాపై రజినీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. 

 

ఇక నేడు ఈ సినిమాకు వస్తున్న టాక్ ను బట్టి చూస్తే, ఓవరాల్ గా సినిమా యావరేజ్ అనే టాక్ ఎక్కువగా వినబడుతోంది. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను మాస్ కమర్షియల్ హంగులతో జతచేసి తెరకెక్కించ గల దిట్టగా పేరు ఉన్న ఏ ఆర్ మురుగదాస్, ఈ సినిమాను కూడా అదే పంధాలో తెరకెక్కించాడని అంటున్నారు. ఇటీవల మురుగదాస్ తీసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో, తొలిసారిగా రజనీతో ఆయన జతకడుతుండడంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అందరు ఆశించార. ఫస్టాఫ్ ని మంచి ఎంటర్టైన్మెంట్, యాక్షన్ అంశాలతో నడిపిన దర్శకుడు మురుగదాస్, అక్కడక్కడా కొంచెం తడబడ్డాడని, అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ అనంతరం ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచుతుంది అని అంటున్నారు. 

 

సెకండాఫ్ కూడా అంత ఆసక్తికరంగా సాగదని, చాలావరకు మధ్యలో వచ్చే ల్యాగులు, ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయని, అయితే అక్కడక్కడా వచ్చే యాక్షన్ సీన్స్ తో పాటు క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకు ప్రధానాకర్షణగా చెప్తున్నారు. మరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మరొక రెండు షోలు తర్వాతనే పూర్తి టాక్ బయటకు రావడం జరుగుతుంది. అయితే ఈ సినిమా రాబోయే రోజుల్లో మంచి సక్సెస్ సాధిస్తే టికెట్స్ దొరకడం కష్టమేనని, ఒకవేళ అంత రేంజ్ లో ఆకట్టుకోకపోతే కలెక్షన్స్ తగ్గుతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.......!!

మరింత సమాచారం తెలుసుకోండి: