సూపర్ స్టార్ రజనీకాంత్ యాక్షన్ ఎంటర్టైనర్ దర్బార్ ఈరోజు విడుదలైంది. లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని విభిన్న చిత్రాల దర్శకుడు,  సౌత్‌ స్టార్‌ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన‌ సంగతి తెలిసిందే.  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు.  ప్ర‌స్తుతం రజినీకాంత్ దర్బార్ సినిమా ఈరోజు థియేటర్లో సందడి చేస్తున్నది. ఇప్పటికే అనేక చోట్ల ప్రీమియర్ షోలు కూడా ముగిశాయి. సినిమా స్టార్టింగ్ నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తుండటంతో రజిని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

 

ఇక ముఖ్యంగా ఈ వ‌య‌స్సులోనూ ర‌జ‌నీ చాలా యంగ్‌గా క‌నిపించాడు. దీనికి ప్ర‌ధాన కార‌ణం మేక‌ప్ అనే చెప్పాలి. వాస్త‌వానికి ఈ వ‌య‌స్సులో ఆయ‌న‌కు మేక‌ప్ వేయ‌డం చాలా క‌ష్టం. ఎందుకంటే వ‌య‌స్సు పైబ‌డే కొద్ది ముఖంలో ఎన్నో మార్పులు సంచ‌రించుకుంటాయి. వాటిని క‌వ‌ర్ చేయాలంటే ఎంత మేక‌ప్ అవుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్కర్లేదు. ప్ర‌స్తుతం ఈ సినిమాలో ర‌జ‌నీని కూడా ఓల్డ్ లుక్ నుంచి అదిరిపోయే యంగ్ లుక్‌లోకి తీసుకువ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ర‌జ‌నీ మేక‌ప్ తీయాలంటే జెసిబి కావాలేమో అంటున్నారు కొంద‌రు.

 

మ‌రోవైపు ఈ సినిమాలో ర‌జ‌నీ గ్రేస్‌, స్టైల్ ఏ మాత్రం త‌గ్గలేదు. అలాగే రజినీ మరియు నయనతారల మధ్య కెమిస్ట్రీ సినిమాకు బాగా ప్ల‌స్ అయింది. ఆరు పదుల వయసు దాటిన అలుపెరుగకుండా సినిమాలను చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. కబాలి, కాలా, 2.O, పేట్టా వంటి వరుస హిట్ చిత్రాల తరువాత దర్బార్ అంటూ సంక్రాంతి పండ‌గ ముందే ఫ్యాన్స్‌ను పలకరించేందుకు వ‌చ్చాడు. కాగా, ముంబై నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆదిత్య అరుణాచలం పాత్రలో నటించాడు రజినీకాంత్. అయితే సినిమా చాలా అద్భుతంగా ఉందని, రజనీ మరోసారి మ్యాజిక్ చేశారని, చిత్రం సూపర్ హిట్ అని తాజా టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: