ఆస్ట్రేలియా దేశంలోని ఆగ్నేయ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న కార్చిచ్చు కారణంగా కొన్ని లక్షల జంతువులు మరణించగా.. మరొకవైపు రెండువేల ఇల్లు దగ్ధమై చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అలాగే ఈ కార్చిచ్చు కారణంగా 25 మంది మనుషులు తమ ప్రాణాలను కోల్పోయారు. ఈ దారుణమైన విపత్తు వలన ఇంకా ఎన్నో కోట్ల నష్టం వాటిల్లింది. దాంతో చాలామంది ఆస్ట్రేలియా దేశానికి కాష్ రూపంలో విరాళంగా అందజేస్తున్నారు.


ఇందులోని భాగంగా లాస్ ఏంజెల్స్ కి చెందిన ఒక 20ఏళ్ల మోడల్ కైలెన్ వార్డ్.. పది డాలర్ల ఎవరైనా ఆస్ట్రేలియా వైల్డ్ ఫైర్ రిలీఫ్ కు విరాళంగా ఇస్తే తన నగ్న ఫోటోలను వారికి పంపిస్తానని ఆఫర్ ఇచ్చింది. దాంతో చాలామంది దాతలు... ఆస్ట్రేలియా కార్చిచ్చు బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఒక ఫండ్స్ కలెక్షన్ వెబ్సైట్లో 10 డాలర్లను విరాళంగా ఇచ్చి... దానం చేసినట్లు చూపించే ఒక ఆన్ లైన్ ప్రూఫ్ రిసిప్ట్ ను కైలెన్ వార్డ్ ట్విట్టర్ అకౌంట్ కి షేర్ చేసారు. దాంతో కైలెన్ వార్డ్ ఆ దాతలకు తన నగ్న ఫోటోలను పంపించింది. అయితే కొన్ని రోజుల్లోనే 50 వేల మంది... ఐదు లక్షల డాలర్లను విరాళం ఇచ్చి ఆమెకు తెలియజేయగా... ముగ్గురు సహాయంతో తన ట్విట్టర్ అకౌంట్ ని హ్యాండిల్ చేస్తూ ప్రతి ఒక్కరికీ తన నగ్న చిత్రాలను పంపించింది ఈమె.


అలాగే గత ఆదివారం నాడు అనగా జనవరి మూడవ తారీకున 5 లక్షల డాలర్లు అనగా... 3 కోట్ల రూపాయలకు పైగా ఆమె కారణంగా ఆస్ట్రేలియా విరాళ సంస్థకు డబ్బులు అందడంతో... తన నగ్న ఫోటో ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే, ఆమె నగ్న ఫోటో ఇంస్టాగ్రామ్ యొక్క రూల్స్ ని ఉల్లంఘించిన కారణంగా.. ఆమె యొక్క ఐడిని ఇంస్టాగ్రామ్ అధికారులు తొలగించారు. ఏదేమైనా తాను చేసిన ఒక పని వల్ల చాలా కోట్ల రూపాయలు సహాయ సంస్థ ద్వారా బాధితులైన చాలామందికి ఉపయోగపడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: