రజనీకాంత్ దర్బార్  సినిమా ఈరోజు థియేటర్లలో అడుగుపెట్టింది.  ఈ సినిమా కోసం ప్రతి తెలుగు ప్రేక్షకుడే  కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి రజనీకాంత్ అభిమానులతో పాటు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే విడుదలైన టువంటి మొట్ట మొదటి రోజు నుంచే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వస్తోంది అని చెప్పాలి.  మొదటి భాగం అంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని సెకండాఫ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకో లేక పోయారు అని అందుకే సెకండాఫ్ పేలవంగా సాగింది అనేటువంటి ధోరణి ప్రేక్షకులలో కనిపిస్తోంది .

 

ఇలాంటి తరుణంలో ఈ సినిమా కమర్షియల్గా ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి .  అయితే మరొక పక్క  తెలుగు నిర్మాత ఈ సినిమాకు సంబంధించి  కొన్ని రకాల ప్రయత్నాలు చేశారు అంటూ ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది. ఈ సినిమా ని ఆప్ ప్రయత్నం గా చెబుతున్నారు.  తన బ్యానర్లో తీసినటువంటి సినిమా కోసం చాలా థియేటర్ అట్టి  పెట్టుకున్నారు అని , అందుకే ఈ సినిమా రిలీజ్ కి తెలుగులో థియేటర్లు దొరకడం లేదని అంటున్నారు.  ఇంకా పలు చోట్ల థియేటర్లలో ఆయన బుక్  చేసుకుంటున్నారని దర్బార్ కోసం కావాలనే సరైనటువంటి థియేటర్లో ఇవ్వలేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.  కొద్దిరోజుల క్రితమే ఆయన సినిమా విడుదల చేసుకున్నటువంటి , ఆయన సొంత సినిమా  ఉండడంవల్లే థియేటర్లు పరంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తున్నారు .

 

 

మరి ఈ కథనాల పైన ఆ నిర్మాత రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి . ఇప్పటికే ఆ నలుగురిలో ఒకరిగా థియేటర్ ని బ్లాక్ చేస్తున్నారు అని ఆరోపణలు విపరీతంగా ఉండగా ..  ఆయన పెద్ద హీరోల సినిమాలకే ఇలాంటి పరిస్థితి తీసుకు వస్తున్నారు అంటే, చిన్న హీరోల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో - ఏమి చేస్తున్నారు అంటూ సినిమా ప్రేక్షకులు కంగారుపడుతున్నారు. మొత్తం మీద దర్బార్ సినిమా సినిమా ప్రేక్షకులని ఎంతగా ఆకట్టుకుంటుంది అనేది వేచి చూడాలి . రజినికాంత్ స్టామినా ఈ సినిమా తో తేలిపోనుంది. 

 

Jan 9th 2100

మరింత సమాచారం తెలుసుకోండి: