బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న హీరో అమీర్ ఖాన్. ఒకప్పుడు లవర్ బాయ్.. రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం ప్రయోగాత్మక సినిమాలకు మాత్రనే ప్రాధాన్యత ఇస్తున్నారు.  నటనకు స్కోప్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేలా చూసుకుంటున్నారు.  లగాన్ మూవీ అయితే ఏకంగా అస్కార్ నామినేషన్ కి వెళ్లి కొద్దిలో తప్పిపోయింది.  ఆ మద్య అమీర్ నటించిన దంగల్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపింది. దంగల్ మూవీలో ఆయన ఎంత సాదా సీదా పాత్రలో కనిపించారో అందరికీ తెలిసిందే..ఆ పాత్ర కోసం ఆయన పర్సనాటిలీ భారీగా పెంచిన విషయం తెలిసిందే.  అమీర్‌ఖాన్‌ ప్రస్తుతం లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.  ఈ మూవీ సైతం మరో ప్రయోగాత్మకంగా తెరకెక్కించబోతు్నారట. 

 

మూవీ కోసం ఆయన రూపు రేఖలను పూర్తిగా మార్చుకున్నారు. తాజాగా అమీర్‌ కొత్త కొత్త లుక్స్‌లో కనిపిస్తూ అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేస్తున్నాడు. ఈ సినిమా లొకేషన్ లో నుంచి అప్పుడపుడు బయటకు లీకైన అమీర్‌ ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి.  ఈ ఫోటోలో అసలు నిజంగా బాలీవుడ్ అందగాడు.. మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖానా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.  పొడవాటి వెంట్రుకలు.. నెరసిన గెడ్డం.. సాంప్రదాయం ఉట్టిపడేలా టోపీ తో కొంతమంది మహిళలు, చిన్నారులతో కలిసి దిగిన ఫొటో వైరల్‌ అవుతోంది.

 

హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అద్వైత్ చంద్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు..వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది. కరీనాకపూర్ మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది.  మరి ఈ మూవీ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో... అయితే తమ అభిమాన హీరోని ఇలా చూడటం ఒకంత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు అమీర్ ఖాన్ ఫ్యాన్స్.  

మరింత సమాచారం తెలుసుకోండి: