బాహుబలి ప్రాంచైజీ తో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి పాపులారిటీని సాధించారో అందరికి తెలిసిందే. బాహుబలి కి ముందు బాహుబలికి తర్వాత అన్నట్టుగా తెలుగు చిత్ర పరిశ్రమకి గొప్ప పేరుని సంపాదించారు. అంతేకాదు రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ..వీళ్ళ గురించి చెప్పాలంటే కూడా బాహుబలి సినిమాకి ముందు తర్వాత అనే చెప్పాలి. అలా అందరికి ఒకేసారి గొప్ప క్రెడిబులిటి వచ్చింది. అప్పటి నుంచి మన తెలుగు సినిమా మార్కెట్ కూడా భాగా పెరిగింది. అంతేకాదు బాహుబలి సినిమాని చూసే ఆ తర్వాత ప్రభాస్ సాహో తో సాహసం చేయడం, చిరంజీవి సైరాతో ప్రయోగం చేయడం చూశాము. 

 

ఇక తాజాగా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవంగా అందరూ బాహుబలి వంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి ఏ మర్యాద ఆమన్న లాంటి చిన్న సినిమా చేస్తారని ఊహించారు. కాని అందరి ఊహను చెరిపేసి తారక్ చరణ్ లతో సినిమా అనౌన్స్ చేసి గట్టి షాకిచారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే మళ్ళీ మరో బాహుబలి వంటి భారీ సినిమా తీస్తున్నారని ప్రచారం సాగింది. కానీ అలా కాకుండా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని తెరకెక్కిస్తున్నారు. చాలామంది అనుకున్నట్టు బాహుబలి మాదిరిగా రెండు భాగాలు  తీస్తున్నారన్న ప్రచారానికి కూడా జక్కన్న క్లారిటి ఇచ్చాడు. 

 

ఇక ఈ సినిమాలో తారక్ కొమరం భీం గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ చరణ్ కి జోడీగా నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు గనకనే బాలీవుడ్ హీరోయిన్ ఆలియాని తీసుకున్నారన్న టాక్ నడిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో కొత్తగా ఒక టాక్ మొదలైంది. బాహుబలి సినిమా రేంజ్ లో ఆర్.ఆర్.ఆర్ సూపర్ డూపర్ హిట్టయ్యి ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాయడం ఖాయం అని. అయితే ఆ క్రెడిట్ మాత్రం ముగ్గురు పంచుకోవాలి అని. ఎంత బ్లాక్ బస్టర్ అయినా గాని క్రెడిట్ దర్శకుడికో లేక హీరోలిద్దరో పంచుకోవడం కాదు. రాజమౌళి, తారక్, చరణ్..ఇలా ఈ ముగ్గురు ఆర్.ఆర్.ఆర్ సక్సస్ క్రెడిట్ పంచుకోవాల్సిందేనని. అంతేకాదు కాస్త తారక్ కే ఎక్కువగా క్రెడిట్ పోయో ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే చరణ్ కి ఆర్.ఆర్.ఆర్ వంటి భారీ సక్సస్ లో మొండి చెయ్యోనని అనుకోక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: